Keerthy Suresh: ఫైనల్ గా కీర్తి సురేష్ మంచి నిర్ణయం.. ఖుషి అవుతున్న అభిమానులు
Keerthy Suresh Upcoming Movies: స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ కొద్దిరోజుల క్రితం వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేష్ తన సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులకు సైతం షాక్ కి గురి చేస్తున్నాయి.
Keerthy Suresh with Suhas:
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల సత్తా ఉన్న కీర్తి సురేష్.. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ ఇండస్ట్రీలలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాకి కాదు నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకుంది.
మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ తనదైన శైలిలో కెరియర్ లో ముందుకు దూసుకుపోతున్న కీర్తి సురేష్.. తదుపరి సినిమాల కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కీర్తి సురేష్ రాబోయే సినిమాల లిస్టు చూస్తే మనకు ఆశ్చర్యం వేయ్యాక మానదు.
మహానటి చిత్రం తర్వాత దాదాపు 8 వరస ప్లాపులు చవిచూసింది కీర్తి సురేష్. సర్కారు వారి పాట మినహా కనీసం యావరేజ్ గా ఆడిన సినిమాలు కూడా అప్పట్లో కీర్తి సురేష్ కి లేవు.
మహానటి సినిమా తర్వాత ఎన్నో డిజాస్టర్స్ చవిచూసిన కీర్తి సురేష్ కి తాను ది గ్లామర్ పాత్రలో కనిపించిన దసరా సినిమా మంచి విజయాన్ని అందజేసింది. ఇక ఇక్కడి నుంచి కీర్తి సురేష్ చాలా ఆలోచించి మరి అడుగులు వేస్తోంది. వరుణ్ ధావన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న కీర్తి సురేష్
తాజాగా ఇప్పుడు తెలుగులో ఒక చిన్న హీరోతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభిమానులను కూడా అవాక్కయ్యేలా చేస్తోంది.
ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలతో జత కట్టిన ఈ హీరోయిన్ ఇప్పుడు సుహాస్ నటిస్తున్న ఉప్పుకప్పురంబు అనే అమెజాన్ ఓటీటీ సిరీస్ లో నటిస్తోంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సిరీస్ ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా కథ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, తేరి హిందీ రీమేక్ బేబీ జాన్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇలా హీరోతో సంబంధం లేకుండా కీర్తి సురేష్ సినిమాలు ఓకే చేస్తూ హీరోల కన్నా తనకు కంటెంట్ ముఖ్యం అని రుజువు చేస్తోంది. మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో నటించిన కీర్తి సురేష్ సుహాస్ వంటి చిన్న సినిమా హీరో పక్కన కూడా కనిపించడం అంటే సాధారణమైన విషయం కాదు. ఏదేమైనా సినిమాల సెలక్షన్ విషయంలో స్టార్ స్టేటస్ పక్కనపెట్టి సినిమా కథలను ఎంచుకోవడంలో కీర్తి సురేష్ తర్వాతే ఎవరైనా.. ప్రస్తుతం తనని నిర్ణయాలు తన అభిమానులను సైతం ఖుషి చేస్తున్నాయి. మహానటి తరువాత కీర్తి సురేష్ ఒప్పుకున్న కొన్ని సినిమాలు ఆమెకు ఫ్లాప్స్ ఇచ్చాయి.. ఆ విషయం మనసులో పెట్టుకొని ప్రస్తుతం ఈ హీరోయిన్ కథ బాగుంటేనే సినిమా ఒప్పుకుంటోందని తెలుస్తోంది. మొత్తానికి రాబోయే సినిమాలు కీర్తి సురేష్ కి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.
Also Read: Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్ చూస్తే నవ్వులే
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter