Keerthy Suresh wishes to Nani నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా కీర్తి సురేష్‌ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దసరా సినిమాతో ఈ ఇద్దరూ సందడి చేయబోతోన్నారు. రగ్డ్ లుక్‌లో నాని, డీ గ్లామర్‌ లుక్‌లో కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ సినిమా సెట్‌లో నాని, కీర్తి సురేష్‌లు ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దసరా సినిమా సెట్‌లో నాని, తాను కలిసి చేసి అల్లరికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ విషెస్ చెప్పింది కీర్తి సురేష్‌. ఇందులో ఈ ఇద్దరూ షటిల్ ఆడుతూ కనిపించారు. ఇక నాని అయితే తొండాట ఆడేందుకు ప్రయత్నించినట్టున్నాడు. నాని ఆడుతున్న ఆటపై, చెప్పిన అబద్దాలపై కీర్తి సురేష్ కౌంటర్ వేసింది. 


 



అయితే నాని సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడట. సినిమాలు తప్పా ఇంకో ధ్యాస ఉండదట. ఇంకో నలభై రోజుల్లో ఓ పండుగ రాబోతోంది. దసరాను పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుందాం.. నా ఫ్రెండ్, శ్రేయోభిలాషి, సహ నటుడు అంటూ ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడతాడు అని కీర్తి సురేష్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


ఇక నానికి ఇండస్ట్రీ నుంచి విషెస్ వెల్లువెత్తాయి. సమంత అయితే మూడు నాలుగు ఫోటోలను షేర్ చేసింది. సమంత, నాని కలిసి చేసిన సినిమాల్లోంచి స్టిల్స్‌ను షేర్ చేసింది. నాని దసరా నుంచి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన లుక్ అదిరిపోయిందని పొగిడేసింది సమంత. 


నాని మాత్రం ఇప్పుడు దసరా మీద తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. అసలే అంటే సుందరానికీ అనే సినిమా అంతంత మాత్రంగానే ఆడింది. బాగుందనే టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతంతమాత్రంగానే వచ్చాయి. ఇప్పుడు నానికి ఓ సాలిడ్ హిట్ కావాలి. అది దసరా రూపంలో రాబోతోన్నట్టుగా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో దసరా సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే.


Also Read:  Rashmi on amberpet stray dog : కుక్కల దాడిలో పసిబిడ్డ మృతి.. కనికరం చూపించకుండా వాటికే యాంకర్ రష్మీ సపోర్ట్


Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook