Keerthy Suresh's Miss India Movie to be released tomorrow: ‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపును సంపాదించుకుంది స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్ (Keerthy Suresh)‌. సినీనటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో (Mahanati) ఈ కీర్తి సురేశ్ తన అద్భుతమైన నటనతో ఇటు ప్రేక్షకులతోపాటు.. అటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. అయితే కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మిస్‌ ఇండియా' (Miss India)సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించగా.. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్‌ నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్‌ మూవీని హై బడ్జెట్‌తో రూపొందించారు. అయితే కీర్తిసురేశ్‌ను 'మిస్‌ ఇండియా'గా ఆమెను సరికొత్త కోణంలో ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా బుధవారం (నవంబరు 4న) ఓటీటీ వేదికగా (OTT platform) నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సోమవారం జరిగిన వెబినార్‌లో కీర్తిసురేశ్‌ మాట్లాడుతూ.. ఓటీటీలో విడుదలవుతున్న తన రెండో చిత్రం మిస్ ఇండియా అని పేర్కొన్నారు. 'మహానటి' తర్వాత తాను కమర్షియల్‌ సినిమాలు చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్న సమయంలో.. తనకు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయమని అవకాశాలు రావడం గొప్ప విషయమన్నారు. బిజినెస్‌ రంగంలో రాణించాలని మధ్య తరగతి యువతి ఎలా కష్టపడి సక్సెస్‌ అయ్యిందనే విషయం ఆధారంగా 'మిస్‌ ఇండియా' సినిమా తెరకెక్కిందన్నారు. ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీనే ఈ సినిమా అంటూ పేర్కొన్నారు. 'మహానటి' రిలీజ్‌ తర్వాత వర్కవుట్‌ చేయడం మొదలు పెట్టానని అందుకే ఇంత స్లిమ్‌గా అయ్యానని ఆమె పేర్కొన్నారు. 



ఇదిలాఉంటే.. కీర్తి సురేశ్ నటించిన గుడ్‌లక్‌ సఖి సినిమా కూడా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సరసన 'సర్కారు వారి పాట'లో నటిస్తున్నారు. దీంతోపాటు ఆమె 'అణ్ణాత్తే' సినిమాలో కూడా నటిస్తున్నాను. ఈ రెండింటితోపాటు ఓ తమిళ చిత్రం, రెండు తెలుగు చిత్రాలు డిస్కషన్స్‌లో ఉన్నాయని కీర్తి సురేశ్ తెలిపారు.