Keerthy Suresh`s Dog in Special Flight: కుక్క పిల్ల కోసం కీర్తి సురేష్ స్పెషల్ ఫ్లైట్.. మాములుగా లేదుగా!
Keerthy Suresh`s Dog in Special Flight: కుక్క పిల్ల కోసం రష్మిక ఫ్లైట్ టికెట్ అడిగిందని వార్త మరువక ముందే తన కుక్క పిల్ల కోసం కీర్తి సురేష్ స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాణించడం చర్చనీయాంశం అవుతుంది.
Special Flight for Keerthy Suresh's Dog : హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లి మేనక వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె మొదట కొన్ని మలయాళ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తర్వాత నేను శైలజ అనే సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినీ అవకాశాలు దక్కించుకున్న ఆమె మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఆ సినిమా తర్వాత ఆమె చేస్తున్న అన్ని సినిమాకు ఆమెకు సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు కానీ ఆమె మాత్రం సినీ అవకాశాలు వరుసగా అందుకుంటూ ముందుకు వెళుతోంది. తాజాగా ఆమె అనూహ్య పరిస్థితుల్లో వార్తల్లోకెక్కింది. దానికి కారణం ఆమె తన కుక్క పిల్ల నైక్ కోసం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయడం. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎక్కువగా తమ కుక్క పిల్లలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం ద్వారా అభిమానులకు వాటిని పరిచయం చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.
హీరోయిన్లు మాత్రమే కాదు రామ్, రామ్ చరణ్ హీరోలు కూడా కుక్క పిల్లలను తమ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా పరిచయం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రష్మిక మందన తన కుక్క పిల్ల కోసం స్పెషల్ గా ఫ్లైట్ టికెట్ లు అడిగిందని ప్రచారం జరగగా దాన్ని ఆమె ఖండించింది కూడా. ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ తన కుక్క పిల్ల కోసం ఏకంగా ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయడమే గాక కుక్క పిల్ల ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుందని చెబుతూ దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఆమె షేర్ చేసింది.
అలా షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ పోస్టుకు కాజల్ అగర్వాల్ మాత్రం కాస్త ఆసక్తికరంగా స్పందించింది. ఫ్లైట్ టేకాఫ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు కుక్కపిల్ల ఏమైనా భయపడిందా అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కీర్తి సురేష్ తన కుక్క పిల్ల కూడా ఒక సోషల్ మీడియా అకౌంట్ ఏర్పాటు చేసి దాని ద్వారా నైక్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ దాన్ని కూడా ఒక సెలబ్రిటీని చేసే పనిలో పడింది.
Also Read: Ram Pothineni Marriage : రామ్ పోతినేని ప్రేమ పెళ్లికి రంగం సిద్ధం.. అమ్మాయి ఎవరో తెలుసా?
Also Read: Ranbir Kapoor First Wife : అలియాతో రెండో పెళ్లి.. మొదటి భార్య గుట్టు బయటపెట్టిన రణబీర్ కపూర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.