Kerala Actor Alleges Woman Director Forced Him To Act In Adult Movie: తనను బెదిరించి అసభ్యకర చిత్రంలో నటింప చేశారు అని చెబుతూ తిరువనంతపురం వెంగనూరుకు చెందిన ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను నటించిన సినిమా డైరెక్టర్ అలాగే అది రిలీజవబోతున్న OTT ప్లాట్‌ఫారమ్‌పై యువకుడు ఫిర్యాదు చేశారు. త్వరలో విడుదల కాబోతున్న ఆ సినిమా మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సిద్దమవుతున్న క్రమంలో అది రిలీజ్ చేస్తే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని అతను ఫిర్యాదు చేసాడు. ఎలా అయినా సినిమాలో హీరోగా నటించాలని భావించిన ఒక 26 ఏళ్ల యువకుడు ఓ ఊబిలో చిక్కుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OTTలో విడుదలయ్యే వెబ్ సిరీస్ కోసం హీరో కావలెను అని ఒక ప్రకటన చూసి దానికి తన వివరాలు పంపాడు.. అయితే అది వెబ్ సిరీస్ కాదు, ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న ఒక యాప్ లో అశ్లీల చిత్రాలను విడుదల చేస్తున్నారు. అయితే ఆ విషయాలు తనకు తెలియవు అని అతను చెబుతున్నాడు. వెబ్ సిరీస్ ఉందని, చెప్పి ఒక కిలోమీటరు లోపలికి ఉన్న విల్లాకు తీసుకు వెళ్లారు. అక్కడ షూటింగ్ కు సంబంధించిన సెటప్ సిద్ధం చేశారు. అప్పటికి కూడా ఇది అశ్లీల చిత్రమని సదర్ యువకుడు భావించ లేదు. కథ లైన్ చెప్పి మేకప్‌తో రమ్మని డైరెక్టర్ కోరడంతో మేకప్ వేసుకుని వచ్చాడు. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.


ఆ తర్వాత షూట్‌లో ముందుకు వెళ్లాలంటే ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పదాంతో యువకుడికి అనుమానం వచ్చి అసలు ఇప్పుడు కాంట్రాక్టు ఎందుకు అని అడిగితే, అది అవసరమని చెప్పారు అక్కడి వారు. దీంతో తొలిసారి హీరోగా నటిస్తున్నానన్న టెన్షన్‌లో ఆ ఒప్పందాన్ని చదవలేకపోయానని యువకుడు చెబుతున్నాడు. అలా సంతకం చేసి ఇచ్చాక లేడీతో ఇంటరాక్ట్ అయ్యి నటించాలని చెప్పారని, నాకు కష్టమని చేయనని చెబితే ఒప్పందంపై ఎందుకు సంతకం చేశారని ప్రశ్నించారు, ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల షూట్ చేయాల్సిందే అని లేకుంటే అది తప్పినందుకు రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని అనడంతో అతను ఆలోచనలో పడ్డాడు.


పారిపోతే పట్టుకుంటారని కూడా చెప్పడంతో అప్పటికి బయట పడేందుకు డైరెక్టర్ చెప్పినట్టు చేసినా ఇప్పుడు విడుదల చేయబోతున్నట్లు యువకుడుడికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాను దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఓ మహిళ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 5 భాషల్లో తెరకెక్కించారని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా పోస్టర్ బయటకు రావడంతో తనను ఇంటి నుంచి గెంటేశారని యువకుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఆ యువకుడు తన స్నేహితుడి వద్ద ఉంటున్నాడట. ఈ సినిమా విడుదలయ్యాక స్థానికుల ముందు కానీ, కుటుంబసభ్యుల ముందు కానీ తల ఎత్తుకుని బతకలేనని, అది రిలీజ్ అయితే తన 8 ఏళ్ల సినీ కెరీర్‌కు ముగింపు పలకడమే అని, ఆత్మహత్య ఒక్కటే తన ముందున్న ఆప్షన్ అని ఆ యువకుడు చెబుతున్నాడు.


తాను సంతకం చేసిన కాంట్రాక్ట్ కావాలని చిత్ర నిర్మాతలను సంప్రదించగా, వారు ఫోన్ ఎత్తలేదని యువకుడు చెబుతున్నాడు. దీంతో ఆ యువకుడు ముఖ్యమంత్రి, తిరువనంతపురం సిటీ పోలీస్ కమిషనర్‌కు వేర్వేరుగా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఈ సినిమా టీజర్ బయటకు వచ్చింది. యువకుడు కుదుర్చుకున్న ఒప్పందంలో 90 శాతం శరీరం నగ్నంగా ఉండవచ్చని రాసిచ్చాడని ఇప్పుడు ఆ దర్శకురాలు చెబుతున్నారు. చూడాలి ఈ వ్యవహరం ఎన్ని మలుపులు తిరగనుంది అనేది. 


Also Read: Balakrishna for Allu Sirish: అల్లు హీరో కోసం బాలయ్య.. అరవింద్ పిలుపుకు గ్రీన్ సిగ్నల్!


Also Read: Prabhas Facts: హీరో కాకుంటే ప్రభాస్ అదే అయ్యేవాడట.. 20 ఏళ్లలో ఎన్ని వందల కోట్లు సంపాదించారో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook