KGF 2 Box Office Day 2: యష్ హీరోగా నటించిన కేజీఎఫ్​ ఛాప్టర్​ 2 సూపర్ హిట్ టాక్​తో దూసుకెళ్తోంది. దీనితో థియేటర్లలో వసూళ్ల సునామీ కొనసాగుతోంది. మొదటి రోజుకు ధీటుగా రెండో రోజు కూడా కలెక్షన్లు నమోదైనట్లు సినీ విశ్లేషకులు ద్వారా తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి రోజు అంచనాలకు మించి రూ. 135 కోట్ల వరకు వసూళ్లు సాధించిన ఈ మూవీ రెండో రోజు కూడా జోరును కొనసాగించింది. రెండో రోజు ఈ మూవీ రూ. 86-88 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లు తెలిసింది. తొలి రెండు రోజుల్లోనే.. అన్ని భాషల్లో కలిపి ఈ మూవీ రూ. 202-204 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు వెల్లడైంది. లాంగ్ వీకెంట్ రావడంతో సినిమాకు ప్లస్ పాయింట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. శనివారానికి టికెట్ బుకింక్స్ అంచనాలను లెక్కలోకి తీసుకుంటే.. మూడు రోజుల్లో రూ. 300 కోట్ల వసూళ్లు (నెట్​) సాధించడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.


ఒక్క హిందీలోనే ఈ మూవీ మొదటి రోజు రూ. 53.95 కోట్లు, రెండో రోజు రూ. 46.79 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.



ఇదిలా ఉండగా.. మరో సినీ  విశ్లేషకులు రమేశ్​ బాలా రెండు రోజుల్లోనే కేజీఎఫ్​-2 గ్రాస్​ రూ. 300 కోట్లు దాటినట్లు ట్వీట్​ చేశారు.



కేజీఎఫ్​-2 గురించి..


కన్నడ దర్శకుడు ప్రశాంత్​ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఏ అంచనాలు లేకుండా వచ్చిన చాప్టర్​-1 సూపర్​ హిట్​ టాక్ తెచ్చుకుని.. అంచనాలకు మించి వసూళ్లు సాధించింది. దీనితో రెండో భాగం అయిన కేజీఎఫ్​-ఛాప్టర్​-2పై భారీ అంచనాలు వచ్చాయి. అన్ని భాషల్లో ఈ మూవీకోసం సినీ ప్రేమికులు వేయి కళ్లతో ఎదురు చూశారు. కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఏప్రిల్ 14న ఈ మూవీ విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా ఉన్నట్లు టాక్ రావడంతో.. వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.


ఈ సినిమాలో యశ్​కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. సంజయ్ దత్​, ప్రకాశ్​ రాజ్​, రావు రమేష్​, రవీణా తాండన్​ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. కన్నడలో తీసిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి డబ్​ అయ్యింది.


Also read: Alia Ranabir Kissing Video: అలియా ముందు మోకరిల్లి... ముద్దుతో ప్రేమను వ్యక్తపరిచిన రణబీర్ కపూర్...


Also read: Mobile Theatre: ఏపీలో తొలి మొబైల్ థియేటర్, ఆచార్య సినిమాతో ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook