Alia Ranabir Kissing Video: అలియా ముందు మోకరిల్లి... ముద్దుతో ప్రేమను వ్యక్తపరిచిన రణబీర్ కపూర్...

Alia Ranabir Kissing Video: బాలీవుడ్ కొత్త జంట అలియా-రణబీర్‌ల 'ముద్దు' వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకలో భాగంగా వరమాల వేసే సందర్భంలో రణబీర్ అలియాకు ముద్దు పెట్టాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 12:50 PM IST
  • అలియా రణబీర్ వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు వైరల్
  • సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మరో వీడియో
  • ముద్దుతో అలియాకు తన ప్రేమను వ్యక్తపరిచిన రణబీర్
Alia Ranabir Kissing Video: అలియా ముందు మోకరిల్లి... ముద్దుతో ప్రేమను వ్యక్తపరిచిన రణబీర్ కపూర్...

Alia Ranabir Kissing Video: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్-రణబీర్ పెళ్లి జరిగి రెండు రోజులైనా ఇప్పటికీ బీ-టౌన్‌లో ఇదే హాట్ టాపిక్. ఈ నెల 14న కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అలియా-రణబీర్ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ముంబై బాంద్రాలోని 'వాస్తు' అపార్ట్‌మెంట్‌లో ఈ జంట పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో లీకైంది. అలియా-రణబీర్‌ల ఈ 'ముద్దు' వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

పెళ్లి వేడుకలో భాగంగా అలియా-రణబీర్ దండలు మార్చుకునే ఘట్టం సరదా సరదాగా సాగింది. ఆ సమయంలో వరుడు రణబీర్ మెడలో వధువు అలియా వరమాల వేయబోగా... రణబీర్ బంధువులు అతన్ని పైకి ఎత్తుకున్నారు. దీంతో అలియా అతన్ని అందుకోలేకపోయింది. పాపం... అలియా అలా ఇబ్బందిపడటం చూడలేకపోయిన రణబీర్ కపూర్ వెంటనే కిందకు దిగేశాడు. ఆపై అలియా ముందు మోకరిల్లి ఆమెతో మెడలో దండ వేయించుకున్నాడు. అంతేనా.. అందరి ముందే అలియా భట్‌ను ముద్దు పెట్టుకుని తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలియాపై రణబీర్ ప్రేమకు ఫిదా అవుతున్నారు.

అలియా-రణబీర్‌ల ప్రేమ బంధం 2017లో మొదలైంది. 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ సెట్స్‌లోనే ఈ ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. రణబీర్ అంటే తనకు చాలా క్రష్ అని అంతకుముందు చాలా సందర్భాల్లో అలియా వెల్లడించింది. బర్ఫీ చూశాక రణబీర్‌పై ప్రేమ మరింత పెరిగిందని ఓ సందర్బంలో చెప్పింది. అలియాకి దగ్గరయ్యాక రణబీర్ కూడా ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. దాదాపు నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత ఎట్టకేలకు ఈ జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైంది. 

Also read: Kidney Health: మూత్రం రంగు మారిందా.. బీ అలర్ట్.. కిడ్నీ వ్యాధికి సంకేతం కావొచ్చు..

Also Read: Mobile Theatre: ఏపీలో తొలి మొబైల్ థియేటర్, ఆచార్య సినిమాతో ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News