KGF 2 producers Hombale Films announce New Movie with Yuva Rajkumar: కేజీఎఫ్‌ చాప్టర్ 1, 2 ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ రికార్డులను షేక్ చేసిన కేజీయప్‌ చాప్టర్‌ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్‌ చాప్టర్‌ 2 ఇటీవలే విడుదలయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో దర్శకుడు, హీరోకు ఎంత పేరు వచ్చిందో నిర్మాణ సంస్థ 'హోంబ‌లే ఫిలిమ్స్'కు కూడా అంతే పేరొచ్చింది. ప్రస్తుతం హోంబ‌లే ఫిలిమ్స్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క‌న్న‌డ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ అయిన హోంబ‌లే ఫిలిమ్స్ భారీ స‌ర్‌ప్రైజ్ ఉండ‌బోతుంద‌ని ఇంతకుముందు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. చెప్పినట్టుగానే ఈరోజు కొత్త సినిమాను ప్రకటించి హోంబ‌లే ఫిలిమ్స్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. క‌న్న‌డ కంఠీర‌వ, లెజెండ‌రీ నటుడు రాజ్ కుమార్ మ‌న‌వడు యువరాజ్ కుమార్‌తో హోంబ‌లే ఫిలిమ్స్ కొత్త సినిమా చేస్తోంది. ఈ సినిమాతోనే యువరాజ్ కుమార్‌ వెండి తెరకు  ప‌రిచ‌యం అవుతున్నాడు. 


యువరాజ్ కుమార్‌ ఇంట్ర‌డ‌క్ష‌న్ పోస్ట‌ర్‌ను హోంబ‌లే ఫిలిమ్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'వార‌సత్వం కొన‌సాగుతుంది' అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.  'యువరాజ్ కుమార్‌ను పరిచయం చేయడం గర్వంగా ఉంది' అని పోస్టర్‌లో హోంబ‌లే ఫిలిమ్స్ పేర్కొంది. పోస్టర్‌లో యువరాజ్ కుమార్‌ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నాడు. దివంగ‌త పునీత్ రాజ్ కుమార్ సోద‌రుడు రాఘ‌వేంద్ర రాజ్ కుమార్ కుమారుడే ఈ యువ రాజ్‌కుమార్‌. పునీత్ రాజ్ కుమార్‌కు 'యువ‌ర‌త్న' లాంటి బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌ ఇచ్చిన సంతోష్ ఆనంద్ర‌మ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు.



హోంబలే ఫిలిమ్స్ అధినేత విజ‌య్ కిరగందూర్ అన్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం హోంబలే ఫిలిమ్స్ రెండు భారీ చిత్రాలను నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా చేస్తున్న హోంబలే ఫిలిమ్స్.. క‌న్న‌డ‌లో స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో కంటారా సినిమాను నిర్మిస్తోంది. కేజీఎఫ్‌ మాదిరే స‌లార్ కూడా హిట్ అయితే హోంబలే ఫిలిమ్స్ మరింత పేరుప్రఖ్యాతలు అందుకోనుంది. 


Also Read: Sonu Sood First Look: ఆచార్యలో సోనూ సూద్ లుక్ ఇదే.. గతంలో ఎన్నడూ చేయని కారెక్టర్!


Also Read: 'ఆ పరుగులను కూడా ఛేదించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.. బెంగళూరుకు ప్లేఆఫ్స్‌ కష్టమే'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.