కన్నడ సినిమాలో సూపర్ డూపర్ స్టార్‌గా ఉన్న రాకీ భాయ్ అలియాస్ యశ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్ సినిమాతో అతడి ఖ్యాతి ప్రపంచ పరిచయమైంది. అందుకే అతడంటే అభిమానులు పడి చచ్చిపోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్ ఇండియా హీరో, కేజీఎఫ్ స్టార్ నటుడైన యశ్ కీర్తి ఇప్పుడు అంతర్జాతీయమైపోయింది. యశ్ సినిమా వచ్చిందంటే చాలు..జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అభిమానుల కోసం రాత్రి 3 గంటలకు కూడా స్పెషల్ షో వేస్తున్నారు. యశ్ అంటే క్రేజ్ ఎందాక వెళ్లిందంటే అతని కోసం పడిచచ్చిపోయేంతగా. అతడి పేరుపై చేసే కొన్ని కార్యక్రమాలతో ప్రపంచ రికార్డులు కూడా సృష్టించారు అతని ఫ్యాన్స్. 2020లో యశ్ పుట్టిన రోజు సందర్భంగా అతడి అభిమానులు ఏకంగా 5 వేల కిలోల కేక్ తయారు చేయించారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద సెలెబ్రిటీ కేక్‌గా వరల్డ్ రికార్డ్ సాధించింది.


ప్రపంచంలో అతిపెద్ద సెలెబ్రిటీ కటౌట్ కూడా యశ్ పేరుపై ఉంది. అతడి పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు 216 అడుగుల కటౌట్ తయారు చేయించారు. కేజీఎఫ్ 2 విడుదలైన తరువాత 23, 400 పుస్తకాలతో పోట్రెయిట్ తయారు చేశారు. ప్రపంచంలో ఇదే అతి పెద్దది. అంతేకాదు..యశ్‌ను చూడ్డానికి అవలేదనే నిరాశతో ఓ అభిమాని ఏకంగా అతి ఇంటి ముందు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతూ కూడా యశ్ నామస్మరణే చేశాడు ఆ అభిమాని.


రాత్రి 3 గంటలకు కేజీఎఫ్ 2 షో


కేజీఎఫ్ 2 చూసేందుకు కర్ణాటకలోని సినిమా ఘర్‌కు వచ్చిన జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఒడిశా చరిత్రలో తొలిసారి ఓ సినిమా స్పెషల్ షో రాత్రి 3 గంటలకు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


రాకీ భాయ్ ముఖం టాటూ కూడా అభిమానులకు క్రేజ్‌గా మారింది. యశ్ స్టైల్, లుక్స్‌ని అభిమానులు తెగ ఫాలో అవుతుంటారు. అలాంటిదే ఓ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. యశ్ స్టైల్ అనుకరిస్తూ 14 ఏళ్ల బాలుడు తాగిన సిగరెట్ల ప్రభావంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 


Also read: Samantha: సరికొత్త లుక్‌లో సమంత.. ఇలా మారిపోయిందేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook