Khiladi Movie: మాస్ మహారాజా రవితేజ ఖిలాడీగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జరిగిన ఆసక్తికర పరిణామం ఇప్పుడు హాట్‌హాట్‌గా మారింది. టాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రవితేజ హీరోగా, దింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా వస్తున్న ఖిలాడీ..ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సినిమా ఫిబ్రవరి 11న అంటే రేపు విడుదల కానుంది. అయితే ప్రీ రిలీజ్ వేడుకలో జరిగిన ఆ పరిణామమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు సమాన ప్రాతినిధ్యముంటుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో అందరి ముందు రమేష్ వర్మ..హీరోయిన్ మీనాక్షి చౌదరికి క్షమాపణలు చెప్పాడు. ఖిలాడీ (Khiladi) ట్రైలర్ , ఇతర ప్రమోషన్లలో డింపుల్ హయతిని ఎక్కువగా చూపించడమే దీనికి కారణం. ఈ విషయాన్ని దర్శకుడు రమేష్ వర్మ స్వయంగా అంగీకరించాడు. అందుకే వేదిక పైనుంచే మీనాక్షికి సారీ చెప్పాడు. సినిమాలో ఇద్దరి పాత్రకు సమాన ప్రాధాన్యత ఉంటుందన్నాడు. సినిమా చూసిన తరువాత మీనాక్షి చౌదరి సైతం సంతోషిస్తోందన్నాడు. అటు మీనాక్షి చౌదరి కూడా చిరునవ్వు నవ్వి ఊరుకుంది.


ఈ పరిణామమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్ కోసం ఇలా చెప్పారా లేదా దర్శకుడు రమేష్ వర్మ నిజంగానే సారీ చెప్పారా అనే విషయాలపై ట్రోలింగ్ నడుస్తోంది. మరికొంతమది అంతమంది ముందు ఓ దర్శకుడు..సారీ చెప్పడం మంచి పరిణామమంటున్నారు.


Also read: Megastar Chiranjeevi: 13 ఏళ్ల తరువాత మళ్లీ నటించనున్న మెగాస్టార్ చిరంజీవి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook