Kiara Advani: కియారా అద్వానీ ఆగ్రహానికి కారణమేంటి
Kiara Advani: బాలీవుడ్ నటి కియారా అద్వానీ నెటిజన్లపై మండిపడుతున్నారు. అనవసర విషయాల్లో ట్రోలింగ్ చేసినందుకు మండిపడుతున్నారు. నెటిజన్లపై ఆమె ఆగ్రహానికి కారణమేంటి..
Kiara Advani: బాలీవుడ్ నటి కియారా అద్వానీ నెటిజన్లపై మండిపడుతున్నారు. అనవసర విషయాల్లో ట్రోలింగ్ చేసినందుకు మండిపడుతున్నారు. నెటిజన్లపై ఆమె ఆగ్రహానికి కారణమేంటి..
టాలీవుడ్, బాలీవుడ్ (Bollywood) రెండింటిలో తనదైన ముద్ర వేసుకున్న నటి కియారా అద్వానీ. కబీర్ సింగ్ సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్‌తో స్టార్‌డమ్ సంపాదించుకుంది కియారా. ఇప్పుడు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది. గత కొన్నేళ్లుగా సిద్ధార్ద్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న కియారా ఇటీవల ప్రియుడి ఇంటికి వెళ్లినప్పుడు తీసిన వీడియో కాస్తా ఆమెను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రియుడి ఇంటికి వెళ్లినందుకు కాదు..కారు డోర్ స్వయంగా తెరవనందుకు ఆమెపై ట్రోలింగ్. విచిత్రంగా ఉందా..నిజమే మరి.
సిద్ధార్ధ్ మల్హోత్రా అపార్ట్‌మెంట్‌లో కియారా అద్వానీ (Kiara Advani) కారు ప్రవేశించగానే..సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వృద్ధుడు కారు డోరు తెరిచి ఆమెకు సెల్యూట్ చేశాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియారా ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతూ ట్రోలింగ్ ప్రారంభించారు. కారు డోరు తీసుకోవడం కూడా చేతకాదా అని కామెంట్లు పెడుతున్నారు. ముసలివారితో ఇటువంటి పనులు చేయించుకోవడం సిగ్గుచేటంటూ విమర్శలు అందుకున్నారు. నెటిజన్ల ఈ వైఖరిపై కియారా అద్వానీ మండిపడ్డారు. నా స్థానంలో ఒకవేళ హీరో ఉండి ఉంటే..ఇలాంటి కామెంట్స్ చేసేవారు కాదు కదా అని ప్రశ్నించింది. ఆయన సెక్యూరిటీ గార్డు కాబట్టి స్వతహాగా చేసిన పనిని తప్పుబట్టడమేంటని మండిపడింది. ఈ ట్రోలింగ్ అనవసరమని వ్యాఖ్యానించింది.
Also read: Salman Khan Birthday: బాలీవుడ్ కండల వీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు, సల్లూ భాయ్ అసలు పేరేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి