Salman Khan Birthday: బాలీవుడ్‌ను ఏలుతున్న ఖాన్ త్రయంలో ఒకడు, కండల వీరుడిగా ప్రసిద్ధి చెందిన హీరో సల్మాన్ ఖాన్. డిసెంబర్ 27 అంటే ఇవాళ ఆ కండల వీరుడి 56వ పుట్టినరోజు. మైనే ప్యార్ కియాతో సృష్టించిన కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతోంది.
బాలీవుడ్ పేరు వింటే చాలు సల్మాన్ ఖాన్ పేరు గుర్తుకు రావల్సిదే. దాదాపు 30 ఏళ్లుగా బాలీవుడ్‌పై అంతగా ముద్రవేసిన హీరో సల్మాన్ ఖాన్. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న సల్లూ భాయ్ అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం. 1965 డిసెంబర్ 27 న జన్మించిన సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ప్రముఖ సినీ రచయిత. 1988లో బీవీ హోతో ఐసీ సినిమాలో సహాయ నటుడిగా తెరంగేట్రం చేసినా..పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తరువాత 90ల్లో విడుదలైన మైనే ప్యార్ కియాతో ఇక వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం లేకపోయింది. ఆ తరువాత హమ్ ఆప్కే హై కౌన్, కరన్ అర్జున్, బీవీ నెంబర్ 1, హమ్ దిల్ దేచుకే సనమ్, కుచ్ కుచ్ హోతా హై, సుల్తాన్, భజరంగి భాయ్‌జాన్ వంటి సినిమాలతో అతని కెరీర్ దూసుకుపోతూనే ఉంది. ఓ విధంగా చెప్పాలంటే బాలీవుడ్‌ని (Bollywood) శాసిస్తున్నాడని చెప్పవచ్చు.
2000 వ దశకంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) కాస్త వెనుకబడ్డాడు. అయితే వాంటెడ్, దబంగ్ వంటి సినిమాలతో మళ్లీ హిట్ దిశగా దూసుకుపోయాడు. బాడీగార్డ్, ఏక్ థా టైగర్, కిక్, భజరంగి భాయ్‌జాన్ , ప్రేమ్ రతన్ థన్ పాయో సినిమాలు భారీగా కలెక్షన్లు సాధించాయి. బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన హీరో సల్మాన్ ఖాన్ మాత్రమే. ఇంతగా హిట్స్ సాధించాడు కాబట్టే వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోగా నిలిచాడు. తొలి సినిమా బీవీ హోతో ఐసీలో 11 వేల రూపాయలు పారితోషికం తీసుకున్న సల్మాన్ ఖాన్..వంద కోట్ల పారితోషికం స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం బిగ్‌బాస్ (BiggBoss) హిందీ వరుసగా హోస్ట్ చేస్తూ ప్రాచుర్యం పొందిన సల్మాన్ ఖాన్...త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ తరువాత విక్టరీ వెంకటేశ్‌తో కూడా మరో సినిమా చేయనున్నాడు. Wish you A Happy Birth Day to Salman Khan
Also read: RRR Movie Effect: RRR సినిమా ప్రభావం బాలీవుడ్‌పై తీవ్రంగా ఉండనుందా..ఎందుకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి