Kiara advani Diet Secret: సాధారణంగా హీరోయిన్లు అందంగా ఉంటేనే వారిని సినిమాలలో తీసుకుంటారు. అయితే హీరోయిన్లు కూడా మరింత అందంగా ఉండడానికి యోగ,  జిమ్ వంటివి చేస్తూనే.. మరొకపక్క సర్జరీలు కూడా చేయించుకొని.. మరింత అందంగా తయారవుతారు. అయితే బయట కనిపించడానికి అందంగా ఉంటే సరిపోదు.. ఆరోగ్యంగా కూడా ఉండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గజిబిజి లైఫ్ స్టైల్ లో సినిమా షెడ్యూల్ కారణంగా తినడానికి సమయం కూడా ఉండని సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాంటి సమయంలో హీరోయిన్లు తమ ఆరోగ్యం విషయంపై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. అందుకే మన హీరోయిన్లు కూడా తమ ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. తనకు ఇష్టమైన హెల్తీ ఐస్ క్రీమ్ గురించి అభిమానులతో పంచుకుంది. అదే చాక్లెట్ బనానా ఐస్ క్రీం.. ఈ ఐస్ క్రీమ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెప్పుకొచ్చింది. మరి కియారాకు ఇష్టమైన ఆ హెల్దీ ఐస్ క్రీమ్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.


ఐస్ క్రీమ్ కు కావలసిన పదార్థాలు, తయారీ విధానం..


ముందుగా రెండు అరటి పండ్లు తీసుకోవాలి.. చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసి.. ఒక ప్లేట్లో పెట్టి దాదాపు 3 గంటల పాటు వాటిని ఫ్రీజ్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫ్రీజ్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేయాలి.. అందులో  రెండు టేబుల్ స్పూన్ల చాక్లెట్ పౌడర్, వన్ అండ్ ఆఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్, రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్ తేనె అన్నింటిని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. పైన చాకో చిప్స్ తో గార్నిష్ చేసి ఒక బౌల్ లోకి వేసి దాదాపు 8 గంటల పాటు ఫ్రీజ్ చేయాలి. ఇక అంతే హెల్ది చాక్లెట్ బనానా ఐస్ క్రీమ్ రెడీ..



ఇక కియారా తనకు ఇష్టమైన ఫేవరెట్ ఐస్ క్రీమ్ గురించి చెప్పుకొచ్చింది.. అప్పుడే అభిమానులు కూడా దీనిని తయారు చేయడం మొదలుపెట్టేశారు. ఏది ఏమైనా హీరోయిన్స్ అందం విషయంలోనే.. కాదు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు.


కాగా ప్రస్తుతం కియారా అద్వానీ త్వరలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కనిపించనుంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న.. ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ ముగించుకుంది. గతంలో కియారా.. రామ్ చరణ్ హీరోగా.. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామా సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.


Also Read: Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం.. **చ్ఛ కారిపోయిందన్న భక్తులు


Also Read: Stag Beetle: బీఎండబ్ల్యూ, బెంజ్‌ కారు కన్నా ఈ పురుగు చాలా కాస్టిలీ.. ఏమంత స్పెషలో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి