Kichcha Sudeep - Kantara Movie : మాటలు రానీకుండా చేసింది.. కిచ్చా సుదీప్ పోస్ట్ వైరల్
Rishab Shetty Kantara Movie రిషబ్ శెట్టి కంటారా మూవీ ప్రస్తుతం కన్నడలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. కన్నడ కంటారా మూవీ మంచి టాక్ తెచ్చుకోవడంతో.. మిగతా భాషల మేకర్ల కన్ను కూడా పడింది.
Kichcha Sudeep - Kantara Movie : ప్రస్తుతం కన్నడ సినిమాల మీద అందరి దృష్టి పడుతోంది. మంచి చిత్రాలు ఏ భాషలో వచ్చిన కూడా ప్రేక్షకుల ఆదరిస్తున్నారు. ఓటీటీలో అయితే భాషాబేధం లేకుండా సినిమాలను చూస్తున్నారు. కన్నడలో ప్రస్తుతం కంటారా (కంతారా) సినిమా మీద చర్చ జరుగుతోంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన, నటించిన ఈ మూవీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. అంతేకాకుండా మిగతా అన్ని భాషల్లోకి ఈ మూవీని డబ్ చేయాలని హోంబలే సంస్థ అనుకుంటోంది.
తాజాగా కంతారా మూవీని చూసిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. 'మనం మంచి చిత్రాలను చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు మాటలు రావు.. అలా చూస్తుండిపోతాం. కంటారా అనే సినిమా కూడా అలాంటిదే. మన మీద అంతటి ప్రభావాన్నిచూపుతుంది. సింపుల్ పాయింట్.. అయినా కూడా అద్భుతంగా తెరకెక్కించి అందరినీ కన్విన్స్ చేసేశారు. రిషబ్ నటనకు అందరూ ముగ్దులవ్వాల్సిందే. ప్రేక్షకులంతా థియేటర్లో అలా చూస్తుండిపోతారు. ఇలా ఎలా తీశారని ఆశ్చర్యపోతారు..
ఈ పాయింట్ పేపర్ మీద రాయడం వేరు.. దాంట్లో సగం కూడా తెరపై తీసుకురావడం చాలా కష్టం.. క్లైమాక్స్ అద్భుతంగా రాసుకున్నారు.. ఇదంతా కూడా దర్శకుడి విజన్. ఆయన ఊహా శక్తికి, తీసిన దానికి కచ్చితంగా మనం స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాల్సిందే. ఇంత అద్భుతమైన సినిమాను తీసిన రిషబ్, ఆయన టీంకు కంగ్రాట్స్. అజనీష్.. నువ్ అదరగొట్టేశావ్.. దీంట్లో నువ్ మాస్టర్.. హోంబళేకు కంగ్రాట్స్.. ఒక కథను నమ్మి మీరు దాని వెనక నిలబడటం మామూలు విషయం కాదు.
సినిమా ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది.. నేను పొందిన అనుభూతినే అందరూ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను' అని కిచ్చా సుదీప్ పోస్ట్ వేశాడు. మొత్తానికి హిందీలో ఈ మూవీ త్వరలోనే రాబోతోంది. అక్టోబర్ 9న ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను విడుదల చేయబోతోన్నట్టు తెలుస్తోంది.
Also Read : Chiranjeevi Pothuraju Steps: పోతురాజు స్టెప్పులేసిన చిరంజీవి.. వీడియో వైరల్
Also Read : Rahul Ramakrishna Wife : సీక్రెట్‌గా పెళ్లి.. రాహుల్ రామకృష్ణ భార్య పిక్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook