Chiranjeevi Pothuraju Steps: పోతురాజు స్టెప్పులేసిన చిరంజీవి.. వీడియో వైరల్

Chiranjeevi Pothuraju Steps చిరంజీవి పోతురాజు స్టెప్పులు వేశాడు. అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా చిరు వేసిన ఈ స్టెప్పులకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇందులో చిరు సందడిగా నవ్వుతూ కనిపిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2022, 11:57 AM IST
  • అలయ్ బలయ్ ఈవెంట్లో చిరంజీవి
  • పోతురాజు స్టెప్పులేసిన మెగాస్టార్
  • చిరు డ్యాన్స్ వీడియో వైరల్
Chiranjeevi Pothuraju Steps: పోతురాజు స్టెప్పులేసిన చిరంజీవి.. వీడియో వైరల్

Chiranjeevi Pothuraju Steps : అలయ్ బలయ్ ఈవెంట్, అందులో చిరంజీవి గరికపాటి ఇష్యూ అందరికీ తెలిసిందే. నాగబాబు మధ్యలోకి దూరడం, మెగా ఫ్యాన్స్ గరికపాటి మీద ఫైర్ అవ్వడం అందరికీ తెలిసిందే. నాగబాబు, ఉత్తేజ్, బ్రహ్మాజీ ఇలా ఎంతో మంది చిరంజీవి గొప్పదనాన్ని చెబుతూ.. గరికపాటి మీద కౌంటర్లు వేశారు. అలా చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేయడం, సెల్ఫీలు ఆఫండి లేదంటే నాకు సెలవు ఇవ్వండి అని అనడం.. అందరికీ తెలిసిందే. చివరకు గరికపాటి.. చిరుకు క్షమాపణలు చెప్పాడు.

గరికపాటి అంటే తనకు ఇష్టమని, ఆయన ప్రవచనాలు తనకు ఎంతో స్పూర్తినిచ్చేలా ఉంటాయని స్టేజ్ మీదే గరికపాటిని పొగిడేశాడు చిరంజీవి. చిరంజీవి గరికపాటి ఇద్దరూ కూడా దీన్ని ఓ వివాదంగా చూడలేదు. కానీ నాగబాబు వంటి వారు ఎప్పుడైతే ట్వీట్లు వేయడం ప్రారంభించారో ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. మొత్తానికి గరికపాటి అయితే చిరంజీవికి క్షమాపణలు చెప్పేశాడు.

 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

ఇప్పుడు చిరంజీవి పోతురాజు స్టైల్లో స్టెప్పులు వేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మామూలుగానే చిరు స్టెప్పులు వేస్తే సోషల్ మీడియా షేక్ అవుతుంది. ప్రస్తుతం చిరు వేసిన పోతురాజు స్టెప్పులు మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 

చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సక్సెస్ మూడ్‌లో ఉన్నాడు. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. లాంగ్ వీకెండ్ గాడ్ ఫాదర్ సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఇప్పటికే దాదాపు 80 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ గడిచే లోపు వంద కోట్ల మార్క్ టచ్ చేసేలా ఉంది.

Also Read : Rahul Ramakrishna Wife : సీక్రెట్‌గా పెళ్లి.. రాహుల్ రామకృష్ణ భార్య పిక్ వైరల్

Also Read : Sarvadaman Banerjee Re Entry: 35 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన హీరో.. గాడ్ ఫాదర్లో చిరంజీవి నాన్న గారు ఎవరో తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News