KA Movie Box Office Collections: ‘క’ మూవీ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరంలో ఉందంటే..
KA Movie 3rd Day World Wide Box Office Collections: తెలుగులో ముందు నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇతను హీరోగానే కాకుండా దర్శకుడిగా సత్తా చాటాడు. తాజాగా ఇతను ‘క’ అనే టైటిల్ తో ప్రేక్షకులను ఫలకరించాడు. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం మూడు మూడు రోజులు మంచి వసూళ్లనే సాధించింది. తాజాగా మూడో రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
KA Movie 3rd Day World Wide Box Office Collections: గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో కిందామీదైన కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా ‘క’చిత్రంతో పలకరించాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ప్రీమియర్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంతేకాదు కిరణ్ అబ్బవరం కెరీర్ లో హెయ్యెస్ట్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 20 కోట్ల గ్రాస్ వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు మూడు రోజుల్లో రూ. 9.5 కోట్ల షేర్ రాబట్టింది.
తెలుగులో ఈ సినిమా రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ఈరోజుతో దాదాపు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ రోజుతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా చాలా యేళ్ల తర్వాత కిరణ్ అబ్బవరం ఖాతాలో మంచి హిట్ పడిందనే చెప్పాలి. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ లోనే ఈ చిత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుండటం విశేషం
తెలుగులో గతంలో ఇలాంటి తరహా కథ రాలేదని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టులు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ లా నిలిచాయి. కిరణ్ అబ్బవరం తన కెరీర్ లో మంచి యాక్టింగ్ తో అదరగొట్టాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా చిత్రంలో నటించిన నటీనటుల యాక్టింగ్ ఆడియన్స్ ను మెప్పించాయనే చెప్పాలి. ప్రేక్షకులను కట్టి పడేసే సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ దర్శక ద్వయం దర్శకులు సుజీత్, సందీప్ తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ బడా హీరోలు క్యూ కడుతున్నారు. మంచి కథ ఉంటే చెప్పమని యంగ్ డైరెక్టర్స్ కు అప్రోచ్ అవుతున్నారట. ‘క’ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరెక్కిందచారు. తెలుగులో ప్రముక నిర్మాత వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి