Nani Dasara : గత పదేళ్లలో ఒక్క కథ కూడా నచ్చలేదా?.. టాలీవుడ్‌పై తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్
Music Director Santhosh Narayanan మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తాజాగా తెలుగు సినిమా కథల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గత పదేళ్లలో ఎన్నో కథలు విన్నాడట కానీ దసరా కథ అంత బాగా ఏదీ నచ్చలేదట.
Music Director Santhosh Narayanan సంతోష్ నారాయణన్‌కు సౌత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన కంపోజ్ చేసే సాంగ్స్, ఇచ్చే బీజీఎం ట్రెండింగ్ అవుతుంటాయి. రజనీకాంత్ కబాలి సినిమాకు ఆయన ఆర్ఆర్ మెయిన్ హైలెట్, ప్లస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అలా సౌత్‌లో సంతోష్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. అలాంటి సంతోష్ నారాయణన్ తెలుగులో నేరుగా ఒక్క సినిమాను కూడా ఒప్పుకున్నది లేదు. కానీ మొదటి సారిగా నాని దసరా సినిమాకు సంగీతాన్ని అందించాడు.
ఈ క్రమంలో సంతోష్ నారాయణన్ దసరా సినిమా మీద కామెంట్ చేశాడు. గత పదేళ్లుగా ఎన్నో కథలు, స్క్రిప్ట్‌లు తన వద్దకు వచ్చాయట. దాదాపుగా తొంభై కథలు విన్నాడట. కానీ అందులో దసరా అంత బాగా ఏదీ నచ్చలేదని, ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అంటూ సంతోష్ నారాయణన్ చెప్పుకొచ్చాడు. అంటే మిగతా కథలేవీ అంతగా నచ్చలేదా? అందుకే సినిమాలు చేయలేదా? దసరాలో ఉన్న ప్రత్యేకం ఏంటి? ఎందుకు అంతలా చెబుతున్నాడు? అని నెటిజన్లు అనుకుంటున్నారు.
ఇప్పటి వరకు దసరా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. నాని, కీర్తి సురేష్ డీ గ్లామర్ లుక్ అందరినీ మెప్పించింది. ఇక సింగరేణి నేపథ్యంలో ఈ సినిమా రావడంతో మరింతగా హైప్ పెరిగింది. అసలే ఇప్పుడు తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. నాని తెలంగాణ యాస, డిక్షన్ కూడా పర్ఫెక్ట్‌గానే ఉన్నట్టు కనిపిస్తోంది.
ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. నాని ఇప్పుడు నిర్మాతగా, హీరోగా ఫుల్ బిజీ అయిపోయాడు. గత ఏడాది హీరోగా వచ్చిన అంటే సుందరానికీ సినిమా ఫ్లాప్ కాగా.. నిర్మించిన హిట్ 2 సినిమా బ్లాక్ బస్టర్ అయింది. నాని సోదరి చేసిన మీట్ క్యూట్ ఓటీటీలో పర్వాలేదనిపించింది. అలా నానికి గత ఏడాది మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. మరి ఈ ఏడాది దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలానే కనిపిస్తోంది.
Also Read: Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook