Kollywood: ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించారు. రెండ్రోజుల క్రితమే వివేక్ వ్యాక్సినేషన్ వేయించుకోవడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విలక్షణమైన నటనతో, హస్యంతో అందరి మన్ననలు పొందిన కోలీవుడ్ కమెడియన్ వివేక్(Kollywood Comedian Vivek)ఇక లేరు.గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రవైటు ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రముఖ దర్శకులు కె. బాలచందర్ ( Balachander)‌ పరిచయం చేసిన వివేక్‌..రజనీకాంత్ (Rajinikanth)సినిమాల్లో ఎక్కువగా కన్పిస్తుంటారు.మొదట స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన వివేక్‌ మనదిల్‌ ఉరుది వేండం సినిమాతో నటుడిగా అరంగేట్రం​ చేశారు. ఆ తర్వాత తమిళంలో టాప్‌ కమెడియన్‌గా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో ఆయన లేకుండా తమిళంలో సినిమాలు రిలీజ్‌ అయ్యేవి కావని, అంతటి పాపులారిటీ ఉండేదని సినీ ప్రముఖులు అంటుంటారు.


దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆయనకు 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో(Padmasree award)సత్కరించింది. తెలుగులోనూ డబ్బింగ్‌ చితత్రాలతో వివేక్‌ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్‌, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివేక్‌ కొడుకు ప్రసన్నకుమార్‌ 13 ఏళ్ల వయసులో మొదడులో రక్తం గట్టకట్టడంతో చనిపోయాడు. అనారోగ్యం కారణంగా వివేక్‌ తల్లి కూడా మరణించింది. కొడుకు, తల్లి ఆకస్మిక మరణాలతో వివేక్‌ బాగా కృంగిపోయాడని, అప్పటినుంచి సినిమాలు చేయడం కూడా తగ్గించాడని ఆయన సన్నిహితులు తెలిపారు.


ఇటీవలే అంటే గురువారం నాడు వివేక్ చెన్నైలో కరోనా వ్యాక్సిన్ (Corona vaccination) వేయించుకున్నాడు. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్‌ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్‌ మృతి పట్ల దేవీ శ్రీ ప్రసాద్‌, ఏఆర్‌. రెహమాన్(AR Rahman)‌, సుహాసిని, ప్రకాశ్‌రాజ్‌ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. 


Also read: Comedian vivek's health condition: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వివేక్.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook