Krishnam Raju wife: కలిసే సినిమాలు చేశారు.. కలిసి చనిపోవాలని అనుకున్నారేమో?
Krishnam Raju wife: కృష్ణ - కృష్ణంరాజు ఇద్దరిదీ చాలా మంచి అనుబంధం, ఒకేసారి ఇండస్ట్రీ కి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, వెళ్లిపోయేటప్పుడు కూడా అనుకున్నారేమో ఒకేసారి ఇద్దరం వెళ్లిపోవాలని అంటూ కృష్ణంరాజు భార్య శ్యామల ఎమోషనల్ అయ్యారు.
Krishnam Raju wife Cries after Seeing Krishna Body: సూపర్ స్టార్ కృష్ణ మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా శోక సంద్రంలో ముంచిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకప్పటి తరం హీరోలందరూ కన్ను మూయిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు అందరూ కూడా ఒక తరం హీరోలు అని వారంతా ఇప్పుడు కన్నుమూశారని దీంతో ఒక తరం శకం ముగిసినట్లు అయిందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఇక సరిగ్గా అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ కూడా తెల్లవారుజామున నాలుగు గంటల 9 నిమిషాలకు కన్ను మూయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించిన కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కన్నీటి పర్యంతం అయ్యారు. కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరిదీ చాలా మంచి అనుబంధమని, ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు కలిసి మెలిసి ఉన్నారని పేర్కొన్నారు.
అయితే ఇద్దరూ వెళ్ళిపోయేటప్పుడు ఒకేసారి వెళ్ళిపోవాలి అనుకున్నారేమో అందుకే కలిసి వెళ్ళిపోయారు అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక బుధవారం ఉదయం 11 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలోని కృష్ణ భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించమన్నారు. ఆ తర్వాత 12:30 నుంచి గచ్చిబౌలి నుంచి పద్మాలయ స్టూడియోస్ కి కృష్ణ అంతిమయాత్ర జరగనుంది.
పద్మాలయలో కొన్ని సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం మహాప్రస్థానానికి ఆయన అంతిమయాత్ర జరగనుంది. ఇక మరికాసేపట్లో సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని విజయకృష్ణ నివాసం నుంచి గచ్చిబౌలి స్టేడియం కు తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియంలో కృష్ణ పార్థివ దేహం ఉంచనున్నారు.
Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?
Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook