Super Star Krishna last Rituals : సూపర్ స్టార్ కృష్ణ (80) మరణ వార్తతో దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని నుంచి సీఎంలు ఇలా అందరూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. కాసేపట్లో ఏపీ సీఎం జగన్ కూడా కృష్ణ భౌతిక దేహాన్ని సందర్శించనున్నారు. చిరంజీవి, సురేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, మోహన్ బాబు ఇలా టాలీవుడ్ అంతా కూడా కృష్ణకు నివాళులు అర్పించి.. మహేష్ బాబును ఓదార్చారు.
కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు.మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ వేశారు.
కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో మహేష్ బాబు, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ వేశారు.
దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మహేష్ బాబును ఓదార్చారు. నేటి సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో కృష్ణ భౌతిక కాయాన్ని తరలించున్నారు. రేపు పద్మాలయ స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
Also Read : నా చిన్ననాటి మరో పేరు చెరిగిపోయింది.. కృష్ణ మృతిపై స్టార్ కామెంటేటర్ సంతాపం!
Also Read : Krishna Demise: తెలుగు సినిమాకు సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు చేసిన చేసిన కృష్ణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook