మూవీ రివ్యూ:  కృష్ణ‌మ్మ‌
న‌టీన‌టులు:  స‌త్య‌దేవ్, అతిర‌, మీసాల లక్ష్మ‌ణ్, ర‌ఘు కుంచె , నంద‌గోపాల్, కృష్ణ తేజ రెడ్డి త‌దిత‌రులు
డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీ:  స‌న్ని కురపాటి
మ్యూజిక్ :  కాల బైర‌వ‌
నిర్మాత‌:  కొమ్మ‌ల‌పాటి కృష్ణ‌
డైరెక్ట‌ర్:  గోపాల‌కృష్ణ
స‌మ‌ర్ప‌ణ‌ :  కొర‌టాల శివ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ‌. స్టార్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్ఫ‌లణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మీద కొమ్మాల‌పాటి ఈ సినిమాను నిర్మించారు. పూర్తి స్థాయి రివేంజ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా పై టీజ‌ర్, ట్రైల‌ర్‌తో  ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ రోజు విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా ?   లేదా మ‌న మూవీ రివ్యూలో చూద్దాం..


క‌థ విష‌యానికొస్తే..


విజ‌య‌వాడ వించిపేట‌లో భ‌ద్ర (స‌త్య‌దేవ్), కోటి (మీసాల ల‌క్ష్మ‌ణ్),  శివ (కృష్ణ తేజా రెడ్డి) అనాథులు.  అక్క‌డే క‌లిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. అయితే శివ చిన్న‌పుడే జైలుకు వెళ్లిన శివ నేరాలు చేయ‌కూడ‌ద‌నే నిర్ణయానికి వ‌స్తాడు. జైలు జీవితం త‌ర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. కానీ భ‌ద్ర మాత్రం నేరాలు చేస్తూ జీవితం గ‌డుపుతూ ఉంటాడు. ఈ క్ర‌మంలో ఆ ఊర్లోకి ప‌ద్మ‌ (అర్చ‌న అయ్య‌ర్) వ‌స్తుంది. ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు భ‌ద్ర‌. ఈ క్ర‌మంలో నేరాలు ఒదిలేసి ఆటోతో తోలుకుంటూ బ్ర‌తుకుతూ ఉంటాడు. అయితే ఈ ముగ్గురికి అనూహ్యంగా మూడు ల‌క్ష‌లు అవ‌స‌రం అవుతాయి. అయ‌తే జీవితంలో చివ‌రి సారి ఓ నేరం చేసి ఆ డ‌బ్బులు సంపాదించుకోవాల‌నుకుంటారు. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగింది. వారి జీవితం ఎలాంటి మ‌లుపులు తీసుకుందనేదే ఈ సినిమా స్టోరీ.


Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...


తెలుగు స‌హా ఏ భాష తీసుకున్న దాదాపు అన్ని సినిమాలు రివేంజ్ డ్రామా మూవీలే. కృష్ణ‌మ్మ కూడా అదే రొటీనో రివేంజ్ డ్రామా మూవీనే. కానీ ద‌ర్శ‌కుడు దాన్ని మ‌లిచిన తీరు ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో హీరోను ఊర మాస్‌గా చూపించాడు. స‌త్య‌దేవ్‌లోని న‌టుడిని ఎలివేట్ చేసాడు. మెల్ల‌గా క‌థ‌లోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. గ‌తంలో అనాథలైన ముగ్గురు స్నేహితులు ఎలా నేరాల‌కు పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత రియ‌లైజ్ అయి మాములు జీవితాల‌ను లీడ్ చేయాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలో వారి జీవితంలో ఊహించ‌ని  ప‌రిణామాలు వంటివి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ముగ్గురు స్నేహితుల జీవితాల్లో ప్రేమ‌, స్నేహం వంటివి తెర‌పై చాలా చ‌క్క‌గా ప్రెజెంట్ చేయ‌గ‌లిగాడు. ఈ క్ర‌మంలో త‌మ‌కు అన్యాయం చేయాల‌నుకునే వాళ్ల‌పై హీరో ఎలా రివేంజ్ తీసుకోవ‌డం అనే పాయింట్ రొటీన్‌గా ఉన్నా.. వాటిని ప్రేక్ష‌కుల‌ను క‌నెక్ట్ అయ్యేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు. ఇక కొర‌టాల శివ ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి ఈ సినిమాకు క‌లిసొచ్చే అంశమ‌నే చెప్పాలి. ఫ‌స్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నా.. సెకండాఫ్‌లో ప‌రుగులు పెట్టించాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ విష‌యంలో రొటీన్ కాకుండా ఇంకాస్త బెట‌ర్‌గా చేస్తే బాగుండేది. అక్క‌డ‌క్క‌డ కొన్ని లోపాలున్న ఓవ‌రాల్‌గా కృష్ణ‌మ్మ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఫోటోగ్ర‌ఫీ, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. పాట‌లు ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి.



న‌టీన‌టుల విష‌యానికొస్తే..
స‌త్య‌దేవ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న నీళ్ల లాంటి వ్య‌క్తి. ఒక పాత్ర‌లో పోస్తే ఏ రూపం తీసుకుంటుందో అలా ఏ పాత్ర తీసుకున్న త‌న‌దైన శైలిలో మెప్పించ‌డం స‌త్య‌దేవ్ స్పెషాలిటి. యాక్ష‌న్ అండ్ ఎమోష‌న్ సీన్స్‌లో స‌త్య‌దేవ్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. మీసాల ల‌క్ష్మ‌ణ్, పోలీస్ పాత్ర‌లో న‌టించిన నంద‌గోపాల్ త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ర‌ఘుకుంచే, శివ త‌మ  ప‌రిధి మేర‌కు న‌టించి మెప్పించారు.


ప్ల‌స్ పాయింట్స్
 
క‌థ‌నం


స‌త్య‌దేవ్ న‌ట‌న


నిర్మాణ విలువలు


మైన‌స్ పాయింట్స్


రొటీన్ రివేంజ్ డ్రామా


ఫ‌స్టాఫ్


రొటీన్ సీన్స్


రేటింగ్ 2.75/5


కృష్ణ‌మ్మ‌.. ఆక‌ట్టుకునే రివేంజ్ డ్రామా..


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter