పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్న తన 25 వ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ యూరోప్ వెళ్లింది. అక్కడ పవన్‌తో పాటు హీరోయిన్‌తో తాను కలిసి తీసుకున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు త్రివిక్రమ్. దానికి "గుడ్ కంపెనీ.. గుడ్ వర్క్" అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ క్రమంలో ఆ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    పవన్ కళ్యాణ్ నటించబోయే తన కెరీర్‌లోని 25వ చిత్రానికి  ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారని వినికిడి


  • ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని త్రివిక్రమ్ పుట్టినరోజు (నవంబరు 7)న విడుదల చేయాలని భావిస్తున్నారు 


  • అలాగే డిసెంబరులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి, జనవరి 10న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.


  • కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయెల్‌ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఓ ఐటి నిపుణుడి పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తారని చెబుతున్నారు. 


  • హీరో ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు


  • కొలవరీ ఢీ పాటతో పాపులరైన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు 


  • ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద సి.రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు. గతంలో ఆయన పవన్ నటించిన "కెమెరామాన్ గంగతో రాంబాబు" చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్న తన 28వ చిత్రానికి కూడా ఈయనే నిర్మాతగా వ్యవహరించబోతున్నారు


  • బాలీవుడ్ నటుడు పరగ్ త్యాగి ఈ చిత్రంతో విలన్‌గా పరిచయమవుతున్నారు. 


  • అలాగే హిందీ నటుడు, 3 ఇడియట్స్ ఫేమ్ బొమాన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. 


  • హీరో వెంకటేష్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.