Raj Tarun Case: తనను ప్రేమించి మోసం చేశాడని చెబుతున్న లావణ్య మరోసారి యువ హీరో రాజ్‌ తరుణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రోజురోజుకు వీరిద్దరి మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. తాజాగా మళ్లీ మరో బాంబు పేల్చింది. రాజ్‌ తరుణ్‌ ఒక్కరు కాదు ముగ్గురు హీరోయిన్లతో సంబంధాలు నెరుపుతున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Raj Tarun: బిగ్‌ బ్రేకింగ్‌.. యువ హీరో రాజ్‌ తరుణ్‌పై యువతి సంచలన ఆరోపణలు


 


తనను 11 ఏళ్ల పాటు ప్రేమించి మోసం చేశానని లావణ్య అనే యువతి మూడు రోజుల కిందట నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోపణలను తిప్పికొట్టిన రాజ్‌ తరుణ్‌ ప్రతిగా కేసు పెట్టారు. అంతకుముందే లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేశాడు. వారి మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో లావణ్య మరికొన్ని సంచలన విషయాలు తెలిపింది. 'రాజ్‌ నన్ను పెళ్లి చేసుకున్నది. వాళ్ల బంధువులకు కూడా తెలుసు. మాల్వినీ రాజ్‌ తరుణ్‌ పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. అన్ని రకాలుగా నన్ను వాడుకున్న రాజ్‌ తరుణ్‌ ఇప్పుడు మాలివితో ఉన్నాడు. నాకు రాజ్‌ తరుణ్‌ కావాలి. తను లేకుంటే బతకలేను. మాల్వినితో నాకు ప్రాణభయం పొంచింది ఉంది. అన్ని ఆధారాలు పోలీసులకు ఇస్తున్నా. డ్రగ్స్‌ వ్యవహారంలో నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు' అని వివరించారు.

Also Read: Raj Tarun Clarity: లావణ్యపై రాజ్‌ తరుణ్‌ సంచలన ఆరోపణలు.. ఆమెకు డబ్బు, వేరే వ్యక్తి కావాలి


 


ఇక రాజ్‌ తరుణ్‌ తనపై చేసిన ఆరోపణల విషయమై స్పందిస్తూ.. 'మస్తాన్‌ రాజ్‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. వరలక్ష్మి టిఫిన్‌ డ్రగ్‌ కేసులో అతడు నిందితుడు. అతడి ఫోన్‌లో నా నంబర్‌ ఉండడంతో నాకు నోటీసులు ఇచ్చారు. ఆ హీరోయిన్‌ మాల్వి చెప్పేవన్నీ అబద్ధాలు' అని లావణ్య తెలిపింది. 'నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే అన్ని ఆధారాలు ఇస్తాను.. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నా' అని లావణ్య స్పష్టం చేసింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter