Lavanya Tripathi about Varun Tej: సీరియల్స్ తో తన కెరీర్ నీ మొదలుపెట్టిన లావణ్య త్రిపాఠి.. అందాల రాక్షసి సినిమాతో.. హీరోయిన్ గా మారిపోయింది. మొదటి సినిమాతోనే తన అందంతో..అందరి దృష్టిని ఆకట్టుకున్న లావణ్య ఆ తరువాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి హిట్ సినిమాలతో తెలుగులో.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక మిస్టర్ అనే సినిమా సెట్స్ మీద.. మెగా హీరో వరుణ్ తేజ్ ని కలిసిన లావణ్య త్రిపాఠి..అతని ప్రేమలో కూడా పడిపోయింది. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య ..ప్రేమాయనం సీక్రెట్ గానే నడిచింది. అప్పుడప్పుడు మీడియాలో వీళ్ళిద్దరి గురించి.. వార్తలు వినిపించాయి కానీ ఇద్దరు వాటిని కొట్టి పారేశారు. ఇక ఎట్టకేలకు గతేడాది.. నవంబర్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 


మెగా కోడలిగా కూడా లావణ్య.. తన బాధ్యతలను బాగానే నిర్వర్తిస్తోంది. అయితే అనుకోకుండా.. దురదృష్టవ సాత్తు లావణ్య కాలికి చిన్న ఫ్రాక్చర్ అయిందట. దీంతో షూటింగ్లోకి కూడా సెలవు పెట్టి.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది ఈ భామ. ఈ నేపథ్యంలోనే అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో.. ప్రశ్నలకు రిప్లై ఇస్తాను అని చెప్పడంతో అభిమానులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. 


అందులో ఒక వీరాభిమాని.. ఆమె అంటే తనకి చాలా ఇష్టం అని.. ఈ జన్మలో పెళ్లి చేసుకోలేకపోయాను.. వచ్చే జన్మలో అయినా నన్ను పెళ్లి చేసుకుంటావా.. అని లావణ్య త్రిపాఠి ని అడిగాడు. దానికి మెగా కోడలు "హిందూయిజం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి బంధం ఏడు జన్మలు ఉంటుంది" అంటూ ఈ జన్మలో మాత్రమే కాదు వచ్చే ఏడు జన్మల్లో కూడా వరుణ్ తేజ్ తన భర్త అని చెప్పింది లావణ్య త్రిపాఠి. 


దీంతో ఆమె జవాబు అదిరిపోయింది.. అని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి తనల్ అనే ఒక తమిళ్ సినిమా తో బిజీగా ఉంది.


Also Read: Nara Lokesh: యాక్షన్‌ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం


Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి