`ట్రిపోఫోబియా`తో బాధపడుతున్న స్టార్ హీరోయిన్...ఎవరో తెలుసా!
Lavanya Tripathi: సొట్ట బుగ్గల భామ లావణ్య త్రిపాఠి ట్రిపోఫోబియాతో బాధపడుతున్నట్లు ఇన్ స్టా లైవ్ సెషన్ లో అభిమానులతో చెప్పింది.
Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన చిన్నది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి..తర్వాత వరుస ఆఫర్లతో తెలుగు, తమిళ భాషల్లో బిజీ అయిపోయింది.
అటు సినిమాలతో పాటు..సామాజిక మాధ్యమాల్లో(Social Media) యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు..ఇప్పుడు ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నట్లు తెలిపింది. ఎప్పుడూ షూటింగ్స్‌లో బిజీగా ఉండే ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం కొత్త కథలను వినేందుకు సమయం కేటాయించింది. తాజాగా ఈమె తన ఇన్‌స్టా(Instagram) ద్వారా అభిమానులతో ముచ్చటించింది. తనను నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
Also Read: Pushpa: మామూలు మాస్ కాదండోయ్.. ఊర మాస్.. 'తగ్గేదే లే'
ప్రస్తుతం తను ఆహ్లదకరమైన జీవితాన్ని చూస్తున్నానని, కాంక్రిట్ జంగిల్‌కు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఒత్తిపరమైన ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన లావణ్య(Lavanya Tripathi) కొత్త కథలు వింటూ ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపింది.
మనం సంతోషంగా లేనప్పుడు ఇతరులకు కూడా ఎలాంటి ఆనందాన్ని పంచలేము. ఈ సిద్దాంతాన్ని నేను బాగా నమ్ముతాను. మన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందనేది అప్పుడప్పుడు తరచి చూసుకోవడం ముఖ్యం. స్వీయ విశ్లేషణ వలనే నేను చేసే తప్పొప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మన జీవన శైలి(Lifestyle) సక్రమంగా సాగుతుంది.
Also read: పాగల్ ట్రైలర్ విడుదల..విశ్వక్ సేన్ కుమ్మేశాడు భయ్యా!
'నాకు ట్రిపోఫోబియా(Tryphophobia) ఉంది. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే నాలో భయం కలుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తను నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, అందుకే ప్రస్తుతం తను స్వల్ప విరామం తీసుకోవాలనుకుంటున్నట్లుగా తెలిపింది. త్వరలోనే మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook