Actor Abbas Leg surgery news:కలకత్తాలో పుట్టిన అబ్బాస్ అలీ తర్వాత హీరోగా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ కన్నడ సినిమాల్లో నటించారు. ఆయన కాదల్ దేశం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. దాన్నే ప్రేమదేశం పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక ఆ తర్వాత వీఐపీ, ప్రియా ఓ ప్రియా అనే సినిమాలతో కూడా నటించారు. ప్రియా ఓ ప్రియా అనే సినిమాతో తెలుగుతో కూడా హీరోగా మారిన ఆయన తర్వాత కన్నడలో శాంతి శాంతి అనే సినిమాతో హీరోగా మారారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళంలో కూడా ఆయన హీరోగా అనేక సినిమాల్లో నటించారు. తెలుగులో రాజా, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణ బాబు, అల్లుడుగారు వచ్చారు, మాధురి, నీ ప్రేమకై, శ్వేత నాగు, పొలిటికల్ రౌడీ, చంద్రహాస్, అనసూయ, ఇది సంగతి, బ్యాంక్, మారో, అలా జరిగింది ఒక రోజు వంటి సినిమాల్లో కనిపించారు. అయితే 2015లో ఆయన తన సినీ కెరీర్ కి బ్రేక్ తీసుకొని తన కుటుంబంలో కలిసి ఇంగ్లాండ్ వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయ్యారు. అయితే అబ్బాస్ ఇప్పుడు సర్జరీ చేయించుకున్నట్లుగా స్వయంగా ప్రకటించాడు.


కొన్ని సంవత్సరాల క్రితం అబ్బాస్ తన భార్య ఎరామ్ అలీ, కుమార్తె ఎమిరా మరియు కుమారుడు ఐమాన్‌తో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అబ్బాస్ తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుడికాలికి శస్త్ర చికిత్స జరిగిందని, త్వరలోనే ఇంటికి చేరుకుంటానని పేర్కొన్నారు. “నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో నా మనస్సు ఏమాత్రం ప్రశాంతంగా లేదు, కానీ నేను లోపల ఉన్న భయాన్ని అధిగమించడానికి ప్రయత్నించాను, శస్త్ర చికిత్స అనంతరం త్వరలో ఇంటికి చేరుకోనున్నట్టు తెలుస్తోంది.


ఇక నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని అబ్బాస్ పేర్కొన్నాడు. కుడి మోకాలి లిగమెంట్‌లో ఏర్పడిన సమస్య శస్త్రచికిత్సకు దారితీసినట్లు స్పష్టమైంది. ప్రయాణాలను ఇష్టపడే అబ్బాస్ బైక్ రైడ్ వీడియోలను కూడా తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేస్తూ ఉంటారు. అబ్బాస్ కూడా బైక్ రైడింగ్ నుంచి కొంత కాలం విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఇక ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 


Also Read: Mahesh Babu : గంగానదిలో అమ్మ అస్థికలు.. కృష్ణానదిలో నాన్న అస్థికలు.. పుట్టెడు దుఃఖంలో మహేష్‌ బాబు


Also Read: Allu Arjun Allu Arha Cute Video : కందిరీగలు కుడుతున్నాయ్ అంట.. బన్నీతో అర్హ ముద్దు ముద్దు ముచ్చట్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook