Vijay Deverakonda Liger movie to streaming on Disney + Hotstar form September 22: రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రధాన పాత్రలో డేరింగ్ డైరక్టర్ పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం ‘లైగ‌ర్‌’. ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని విజ‌య్‌ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్‌’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. 2022 ఆగ‌స్టు 25న విడుద‌లైన ఈ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. క‌నీసం థియేట‌ర్ రెంట్‌కు స‌రిప‌డ క‌లెక్ష‌న్లు కూడా రాక‌పోవ‌డంతో.. వారం రోజల్లోనే సినిమాను తీసేసారు. ఈ సినిమా ఫ‌లితం మేక‌ర్స్‌ను బాగా నిరాశ‌ప‌రిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థియేట‌‌‌‌‌ర్‌లో చూడని ప్రేక్షకులు లైగ‌ర్‌ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా సినిమా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైగ‌ర్‌ సినిమా గురువారం (సెప్టెంబ‌ర్ 22) నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ఆ వార్తల సారాంశం. ఈ సినిమాను 50 రోజుల త‌ర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని హాట్‌స్టార్‌తో మేక‌ర్స్‌ డీల్ కుదిరించుకున్నారు. అయితే సినిమా ఫ్లాప్ అవ‌డంతో.. హాట్‌స్టార్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం ఆఫ‌ర్ చేసింద‌ట‌. అందుకే లైగ‌ర్‌ ముందుగానే ఓటీటీలోకి వస్తుందట. 


బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన లైగ‌ర్‌ చిత్రాన్ని క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరి జ‌గ‌న్నాధ్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో విజ‌య్‌ దేవ‌ర‌కొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అన‌న్య‌ పాండే న‌టించారు. ప్ర‌ముఖ బాక్సర్ మైఖ్ టైస‌న్ కీల‌క‌ పాత్ర‌లో నటించారు. రూ. 85 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 30 కోట్ల క‌లెక్ష‌న్లు మాత్రమే సాధించి మేక‌ర్స్‌కు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. 


Also Read: కాటేయడానికి దూసుకొచ్చిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. ఒట్టి చేతులతో ఎలా కంట్రోల్ చేశాడో చూడండి!


Also Read: 49 ఏళ్ల వయసులోనూ 'తగ్గదేలే'.. సచిన్‌ బ్యాక్‌ఫుట్‌ పంచ్‌కు దద్దరిల్లిన స్టేడియం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.