RSWS 2022: 49 ఏళ్ల వయసులోనూ 'తగ్గదేలే'.. సచిన్‌ టెండూల్కర్ బ్యాక్‌ఫుట్‌ పంచ్‌కు దద్దరిల్లిన స్టేడియం!

Sachin Tendulkar plays a backfoot punch in Road Safety World Series. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కూడా బ్యాక్‌ఫుట్‌ షాట్ ఆడి ఇండోర్‌లోని హాల్కర్‌ స్టేడియంను హోరెత్తించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 20, 2022, 12:15 PM IST
  • 49 ఏళ్ల వయసులోనూ 'తగ్గదేలే'
  • సచిన్‌ బ్యాక్‌ఫుట్‌ పంచ్‌కు దద్దరిల్లిన స్టేడియం
  • వర్షం రాకపోతే..
RSWS 2022: 49 ఏళ్ల వయసులోనూ 'తగ్గదేలే'.. సచిన్‌ టెండూల్కర్ బ్యాక్‌ఫుట్‌ పంచ్‌కు దద్దరిల్లిన స్టేడియం!

Fans enjoys Sachin Tendulkar backfoot punch in Road Safety World Series 2022: ప్రస్తుతం 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌' 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో క్రికెట్ మాజీలు అందరూ మరోసారి తమ సత్తాచాటున్నారు. తమ ఫేవరేట్ షాట్స్ ఆడుతూ.. వేగంగా పరుగులు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కూడా బ్యాక్‌ఫుట్‌ షాట్ ఆడి ఇండోర్‌లోని హాల్కర్‌ స్టేడియంను హోరెత్తించారు. 49 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా ఆడిన సచిన్ ఆటకు ఫాన్స్ ఫిదా అయ్యారు. 

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా సోమవారం రాత్రి న్యూజిలాండ్ లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ తలపడింది. ఇండియా లెజెండ్స్ తరఫున మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా బరిలోకి దిగారు. దాంతో మైదానంలోని ఫాన్స్ అందరూ 'సచిన్.. సచిన్' అంటూ అరవసాగారు. కైల్ మిల్స్ వేసిన మొదటి ఓవర్‌ ఐదవ బంతిని సచిన్ అద్భుతంగా బ్యాక్ ఫుట్ కవర్ డ్రైవ్ ఆడారు. ఇంకేముంది బంతి బౌండరీ లైన్‌ దాటింది. ఆ బ్యాక్‌ఫుట్‌ పంచ్‌కు స్టేడియం మొత్తం అరుపులు, కేకలతో హోరెత్తింది. 

ల్యాప్‌, పుల్‌ వంటి షాట్లతో న్యూజిలాండ్‌ బౌలర్లకు సచిన్ టెండూల్కర్ చుక్కలు చూపించారు. అయితే బ్యాక్‌ఫుట్‌ పంచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోను రోడ్ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ కూడా షేర్‌ చేసింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. '49 ఏళ్ల వయసులోనూ అద్భుత బ్యాక్‌ఫుట్‌ కవర్ డ్రైవ్.. సచిన్ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు' అని ఒకరు కామెంట్ చేయగా.. '49 ఏళ్ల వయసులోనూ తగ్గదేలే' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 

ఈ మ్యాచులో కేవలం 5.5 ఓవర్ల అట మాత్రమే కొనసాగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి భారత్‌ ఒక వికెట్ కోల్పోయి 49 రన్స్ చేసింది. సచిన్‌ టెండూల్కర్ 146 స్ట్రైక్‌ రేట్‌తో 19 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌ జరిగిన కొద్దిసేపు సచిన్‌ తనదైన షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించారు. వర్షం రాకపోతే సచిన్ ఆటను ఫాన్స్ మరింత ఎంజాయ్ చేసేవారు. ఇండియా లెజెండ్స్ తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా లెజెండ్స్‌పై 63పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. కార్తీక్, అశ్విన్‌లకు నిరాశే! తుది జట్టు ఇదే

Also Read: బ్రిటన్ రాణికి కన్నీటి వీడ్కోలు..అంత్యక్రియలకు తరలివచ్చిన ప్రపంచ నేతలు, చక్రవర్తులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News