Liger Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చేసిన విజయ్ దేవరకొండ `లైగర్`.. సినిమాపై ట్విట్టర్ రివ్యూ ఇదే..
Vijay Deverakonda Liger Twitter Review: రౌడీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైగర్ థియేటర్లలోకి రానే వచ్చింది. సినిమాపై ట్విట్టర్‌లో నెటిజన్ల టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
Vijay Deverakonda Liger Twitter Review: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'లైగర్' ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. డైనమిక్ డైరెక్టర్ పూరి, యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో లైగర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతోనే విజయ్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నాడు. బాయ్‌కాట్ పిలుపులు, నెగటివ్ ప్రచారం జరుగుతున్నప్పటికీ విజయ్ అండ్ సినిమా టీమ్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరి విజయ్, పూరి చెబుతున్నట్లుగా ఈ సినిమా ర్యాంప్ ఆడించేలా ఉందా.. మూవీ చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు... లైగర్‌పై నెటిజన్ల ట్విట్టర్ రివ్యూపై ఇప్పుడో లుక్కేద్దాం...
'ఫస్టాఫ్ మదర్ సెంటిమెంట్.. మాస్ మసాలా.. పూరి సార్ మ్యాజిక్... 10 అర్జున్ రెడ్డిలు ఒకెత్తు, లైగర్ ఫస్టాఫ్ మాత్రమే ఒకెత్తు.. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మాస్ ర్యాంపేజ్...' అంటూ ఓ లైగర్‌పై ఓ నెటిజన్ తన రివ్యూ ఇచ్చాడు.
'డీసెంట్ ఫస్టాఫ్.. బీజీఎం బాగుంది
రమ్యకృష్ణ క్యారెక్టరైజేషన్ ఫైర్
విజయ్ దేవరకొండ ఫైట్స్ అండ్ లుక్స్ ఫైర్
లవ్ ట్రాక్ అంత ఆకట్టునేలా లేదు..' అంటూ థివ్యూ ట్విట్టర్ ఖాతాలో లైగర్ రివ్యూని పోస్ట్ చేశారు.
'ఓకె యాక్షన్ ఎంటర్టైనర్
విజయ్ దేవరకొండ మెరిపించాడు
రమ్యకృష్ణ అండ్ మైక్ టైసన్ ఎఫెక్టివ్‌గా కనిపించారు
సాంగ్స్ బాగాలేవు.. బీజీఎం బాగుంది
స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి
యాక్షన్ సీన్స్ బాగున్నాయి
రేటింగ్ 3/5' అంటూ మరో నెటిజన్ లైగర్‌పై తన రివ్యూ ఇచ్చాడు.
డీసెంట్‌గా సాగే అవకాశం ఉన్న సినిమాను సెన్స్ లేని రైటింగ్, అనవసరపు సీన్లతో చెడగొట్టారు. విజయ్ దేవరకొండ బెస్ట్ ఇచ్చాడు. బాడీ ట్రాన్స్‌ఫామ్ చాలా గొప్పగా ఉంది. నత్తి బాగోలేదు. హీరోయిన్ ట్రాక్ ఘోరంగా ఉంది. కొన్ని మూమెంట్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేటింగ్ 2.25/5 అంటూ ఓ నెటిజన్ లైగర్‌పై తన రివ్యూ ఇలా రాసుకొచ్చాడు.
లైగర్ సినిమాపై ట్విట్టర్‌లో ప్రస్తుతానికి తక్కువ రివ్యూలు ఉన్నాయని చెప్పొచ్చు. అందులో కొన్ని సినిమాను అమాంతం ఆకాశానికెత్తేస్తే కొన్ని రివ్యూల్లో మాత్రం ఓకె అన్నట్లుగా రాసుకొచ్చారు. నెగటివ్ ట్వీట్స్‌పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. పుష్ప, సర్కార్ వారి పాట సినిమాలకు కూడా మొదట నెగటివ్ టాకే వచ్చిందని.. ఆ తర్వాత బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచాయని గుర్తుచేస్తున్నారు. కొంతమంది ఇచ్చే రివ్యూలు గతంలో పలు సినిమాలకు కూడా నెగటివ్‌గానే ఉన్నాయని.. కానీ ఆ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయని అంటున్నారు. మరి విజయ్ దేవరకొండ లైగర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
Also Read : Hyderabad Lathi Charge Video: హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి హై టెన్షన్.. బయటికి లాగి మరీ లాఠీచార్జ్
Also Read: Revanth Reddy on BJP: టీఆర్ఎస్‌తో కేంద్రం లాలూచీ.. అందుకే ఆ పని చేయట్లేదన్న రేవంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook