/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Delhi Liquor Scam Updates: ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. అందులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని ఆరోపించిన బీజేపి.. వారిపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో పోటీచేసినప్పుడు ఆ పార్టీకి ఆర్థిక సహాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వారి ఇళ్లలో సోదాలు చేయాల్సిన బాధ్యత ఉన్న కేంద్ర నిఘా సంస్థలు ఎందుకు ఆ పని చేయడం లేదు అని నిలదీశారు. అందుకే బీజేపీ చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలని.. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపి తీరును ఎండగట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

గతంలో తెలంగాణ ఆప్ ఇంచార్జి సోమనాథ్ భారతి మాట్లాడుతూ.. అవినీతిపరులైన తెలంగాణ ముఖ్యమంత్రిని తాము కలవబోమని అన్నారు. సోమ్‌నాథ్ భారతి మాటలు విని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే నేతలను కేజ్రీవాల్ కలవరనే అందరం భావించాం. కానీ ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెళ్లి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. అంతేకాకుండా కేజ్రీవాల్‌తో కలిసి పంజాబ్‌కు వెళ్లారు. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక సహాయం చేసినట్టుగానే.. వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు వందలాది కోట్లు వారి నుండి వేర్వేరు మార్గాల్లో లబ్ధి పొందారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపించి నిజం నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాగానే వివిధ కంపెనీల మీద ఐటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 30 సంస్థల్లో సోదాలు జరిగాయి. మరి అలాగే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యుల నివాసాలు, వారి కార్యాలయాల్లో సోదాలు ఎందుకు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వివిధ అవినీతి కేసుల్లో పాత్ర ఉందని ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసిఆర్ ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై ఎందుకు విచారణ చేపట్టడం లేదో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు.

కేసీఆర్ కుటుంబసభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయడంలో ఆలస్యం చేస్తే.. వారు ఆధారాలు మాయం చేసే ప్రమాదం ఉంది కదా అని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి కేంద్రం ఎందుకు ఆ అవకాశం ఇస్తుందో చెప్పాలన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడిందని మీరే ఆరోపణలు చేస్తున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) విస్మయం వ్యక్తంచేశారు. కేసీఆర్ కుటుంబంపై సోదాలు చేయకపోవడానికి టీఆర్ఎస్ పార్టీతో కేంద్రానికి ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : Traffic Advisory in Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లే వాళ్లకు పోలీసుల హెచ్చరికలు

Also read : Hyderabad Violence: హైదరాబాద్‌లో హై అలర్ట్.. 7 గంటలకే దుకాణాలు బంద్.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Revanth Reddy demands central govt to take legal action on kcr family if bjp allegations are true
News Source: 
Home Title: 

Revanth Reddy on BJP: టీఆర్ఎస్‌తో కేంద్రం లాలూచీ.. అందుకే ఆ పని చేయట్లేదన్న రేవంత్

Revanth Reddy on BJP: టీఆర్ఎస్‌తో కేంద్రం లాలూచీ.. లేదంటే ఆ పని ఎందుకు చేయట్లేదన్న రేవంత్ రెడ్డి
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Revanth Reddy on BJP: టీఆర్ఎస్‌తో కేంద్రం లాలూచీ.. అందుకే ఆ పని చేయట్లేదన్న రేవంత్
Pavan
Publish Later: 
No
Publish At: 
Wednesday, August 24, 2022 - 22:43
Request Count: 
94
Is Breaking News: 
No