Bigg Boss Season 8 Contestants: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో మొదలు కాబోతోంది. బిగ్ బాస్ క్రేజ్ తగ్గిపోతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ 8 మంచి పాపులారిటీ అందుకుంది. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 మీద కూడా మళ్లీ అంచనాలు పెరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 8 కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ సీజన్ 8 సెప్టెంబర్ మొదటివారం నుంచి మొదలవుతుంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఆగస్టు రెండవ వారం నుంచే మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. 


మరోవైపు అసలు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈమధ్య తన ప్రేమ కథ వల్ల వివాదాలు ఇరుక్కున్న హీరో రాజ్ తరుణ్ ఈ సీజన్లో కంటెస్టెంట్ గా రాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెబుతూ పాపులర్ అయిన వేణు స్వామి కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా మారబోతున్నారు అని ఊహాగానాలు ఉన్నాయి. కిరాక్ ఆర్ పి, శివ ఇలా చాలామంది పేర్లు బయటకు వచ్చాయి..


సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 8 లో రాబోతున్న కంటెస్టెంట్లు వీళ్లే:


1. హీరో రాజ్ తరుణ్
2. యాంకర్ వింధ్య
3. శివ (విష్ణు ప్రియ బాయ్‌ఫ్రెండ్)
4. యాంకర్, యూట్యూబర్ నిఖిల్
5. యూట్యూబర్ బంచిక్ బాబ్లు
6. నటి దీపిక
7. శ్వేత నాయుడు
8. టీవీ సీరియల్ హీరో ఇంద్రనిల్
9. కమెడియన్ సద్దాం
10. కమెడియన్ యాదమ్మ రాజు
11. నటి సనా
12. వేణు స్వామి
13. కిరాక్ ఆర్‌పి


ఇది కేవలం తాత్కాలిక జాబితా మాత్రమే. అసలైన కంటెస్టెంట్లు ఎవరు అనేది బిగ్బాస్ సీజన్ 8 మొదలైన రోజే తెలుస్తుంది. బిగ్ బాస్ షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక గ్రాండ్ సెట్ ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి.


Also Read: RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ


Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి