Taraka Ratna Health Update by Vijay Sai Reddy : నీరు చేరి తారక రత్న మెదడు వాచింది.. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విజయసాయి రెడ్డి
Taraka Ratna Health Live Updates: నందమూరి తారకరత్న నారా లోకేష్ పాద యాత్రలో గుండెపోటుకు గురైన క్రమంలో ఆయనకు ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నారు, ఆయన ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్ లో ఉన్నారు.
Taraka Ratna Health Live Updates: నందమూరి తారకరత్న నారా లోకేష్ పాద యాత్రలో గుండెపోటుకు గురైన క్రమంలో ఆయనకు ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్నారని తెలుస్తోంది. తారకరత్న గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్ అయిందని, మొత్తంగా గుండె పని చేయడం లేదని తెలుస్తోంది. గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్స్ ఉండటంతో ఎక్మో ద్వారా శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారని సమాచారం. తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు ఆయనకు కుప్పంలోని హాస్పిటల్‌లోనే చికిత్సను అందించగా తరువాత పరిస్థితి అత్యంత విషమంగా మారిందని, బెంగళూరుకు తరలిస్తున్నారని తెలిసింది. అయితే తరువాత వద్దనుకున్నా చివరికి ఈ తెల్లవారు జమున ఆయనను బెంగళూరుకు తరలించారు.
Latest Updates
తారకరత్న ఉన్న హాస్పిటల్ లో మీడియాతో మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది
45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన మెదడులోపై భాగం దెబ్బతింది
దాని వలన మెదడులో నీరు చేరి మెదడు వాచింది
వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుంది అని డాక్టర్లు తెలిపారు
బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నకు అన్ని వైద్య సదుపాయాలు కల్పించారు
బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు
మెదడు పై భాగం దెబ్బతినడంతో కొన్ని అవయవాలు కొంత యాక్టీవ్ గా పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు
గుండె బాగానే పనిచేస్తుంది, తారకరత్న త్వరలోనే కోలుకుంటారుటాలీవుడ్లో కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన అలేఖ్యా రెడ్డి
తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అలేఖ్యా రెడ్డి
ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ
కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత సంఘీ టెంపుల్‌లో తారకరత్న- అలేఖ్యల వివాహంతారకరత్న భార్యకు స్వయానా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బాబాయ్
విజయసాయిరెడ్డి సతీమణి సొంత చెల్లెలి కూతురినే వివాహం చేసుకున్న తారకరత్న
విజయసాయిరెడ్డికి వరుసకు అల్లుడు తారకరత్న
విజయసాయిరెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తే తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డినారాయణ హృదయాలయ ఆస్పత్రికి విజయసాయిరెడ్డి
తారకరత్న ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో మాట్లాడిన విజయసాయిరెడ్డితారక రత్న సీటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు
తక్కువ ఆక్సిజన్ అందడంతో బ్రెయిన్ కు ఎఫెక్ట్
బ్రెయిన్ డ్యామేజ్ రికవరీ మీద దృష్టి పెట్టిన డాక్టర్లు
తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న
ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి
తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు
తారకరత్నకు నిన్న బ్రెయిన్ స్కాన్
నేడు రానున్న బ్రెయిన్ స్కాన్ రిపోర్టులు
బ్రెయిన్ స్కాన్ రిపోర్టులను బట్టి చికిత్స కొనసాగించనున్న వైద్యులు
తారకరత్న ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన
ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్''సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది, తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు, May you have a long and healthy life dear Tarakaratna!'' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
నందమూరి తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల
బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యుల హెల్త్ బులెటిన్
తారకరత్న పరిస్థితి విషమంగానే ఉంది
వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం
ఎలాంటి ఎక్మో సపోర్ట్ పెట్టలేదు
కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నాంతారకరత్న పరిస్థితి మెరుగుపడుతోంది: నందమూరి రామకృష్ణ
సొంతంగానే ఊపిరి పీల్చుకుంటున్నారు
క్రమంగా కోరుకుంటున్నారు
ఎక్మో అసలు పెట్టలేదు
సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుంది
తారకరత్న అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయితారకరత్నకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు
కొద్దిసేపటి క్రితం నిర్వహించిన పరీక్షల్లో గుండె, లివర్, కిడ్నీ నార్మల్ గా ఉన్నట్లు రిపోర్ట్
కాసేపట్లో సిటీ స్కాన్ చేయనున్న డాక్టర్లు
సిటీ స్కాన్ ఫలితాలు మెరుగ్గా ఉంటే వెంటిలేటర్ తీసివేసే ఆలోచనలో వైద్యులుకాసేపట్లో తారకరత్నకు కీలక వైద్యపరీక్షలు
ఆ అనంతరం హెల్త్ బులెటిన్ విడుదల
పరీక్షల తర్వాత వైద్య చికిత్సలపై క్లారిటీ వచ్చే అవకాశం
చికిత్సకు తారకరత్న శరీరం స్పందిస్తున్నట్లు చెబుతున్న వైద్యులు
ఇవాళ చేసే పరీక్షలు కీలకమంటున్న వైద్యులు
తారకరత్న సేఫ్ అంటూ నిన్న రాత్రి నుంచి ప్రచారం
నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న నటుడు మంచు మనోజ్
మంచు మనోజ్:
తారకరత్న చిన్ననాటి నుంచి నాకు బాగా తెలుసు
తారకరత్న నాకు మంచి మిత్రుడు, చాలా మంచి వ్యక్తి
తారకరత్న ఆరోగ్యం గురించి డాక్టర్లతోనూ మాట్లాడాను
ఆయన కోలుకుంటాడని వారు నమ్మకాన్ని వెలిబుచ్చారు
ఇదివరకు లాగానే తను మళ్లీ ఆరోగ్యంగా బయటకు రావాలి
తారకరత్న సేఫ్, 10 వారాలు విశ్రాంతి అవసరం
కాసేపట్లో నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యుల ప్రకటన చేసే అవకాశం?
తారకరత్నపై నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్
తారకరత్నతో నాకు ఎప్పుడూ చాలా సన్నిహిత బంధం ఉండేది
ఆయన తీవ్రమైన గుండెపోటుతో బాధపడటం చూసి నిజంగా నా గుండె పగిలిపోయింది
నేను ఇటీవల అతనిని కలిసా
పర్సనల్ లైఫ్, సినిమాలు, రాజకీయాల గురించి చాలాసేపు మాట్లాడాను
తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా
నాకు తెలిసిన అంతకుముందు తారకరత్న తిరిగి రావాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
నందమూరి తారకరత్న పూర్తి ఆరోగ్యవంతుడిగా కోలుకోవాలని దెందుకూరు నుంచి జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరిన నందమూరి అభిమాని నరమనేని అనిల్
తారకరత్న ఆరోగ్యం పై కర్ణాటక మంత్రి సుధాకర్ ప్రకటన
కుప్పం నుంచి బెంగుళూరుకు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించాం
వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నారు
మరో ఇద్దరు స్పెషలిస్ట్ లు వస్తున్నారు
కోలుకుంటున్నారు బాగుంటుందని భావిస్తున్నాం
తారకరత్న ఆరోగ్యం పై జూ ఎన్టీఆర్ ప్రకటన
తారకరత్న పోరాటం చేస్తున్నారు
నిన్నటి మీద ఈరోజు తారకరత్న స్పందిస్తున్నారు
ఎక్మొ మీద లేరు కానీ క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు
అభిమానుల ఆశీస్సులు..తాత ఆశీస్సులతో కోలుకుంటారని ఆశిస్తున్నాను
తిరిగి మనతో తారకరత్న గతంలో లాగానే ఉంటారని భావిస్తున్నాను
నందమూరి ప్రణతితో బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి
తారకరత్న ఆరోగ్యం పై బాలయ్య, శివరాజ్ కుమార్ ప్రకటన..
నిన్నటి మీద కొంత కోలుకున్నట్లు కనిపిస్తోంది
ఇంకా స్టంట్ వేయలేదు.
మరోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండటంలో డాక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు
బ్రెయిన్ ఎంత వరకు డామేజ్ అయిందో తెలియటం లేదు
వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స జరుగుతోంది
గిల్లితే ఒకసారి స్పందించాడు
కంటి పాపలు కూడా కదులుతున్నాయి
ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లుగా కనిపిస్తోంది
కోలుకోవాలని కోరుకుంటున్నాం
అభిమానులు అందరికీ ధన్యవాదాలుఆసుపత్రికి చేరుకున్న కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్
ఆస్పత్రిలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా
ఎన్టీఆర్, శివ రాజ్ కుమార్, కళ్యాణ్ రామ్ సహా తారక రత్న చికిత్స అందుకుంటున్న నాలుగో ఫ్లోర్ కు చేరిక
ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న నందమూరి అభిమానులు
బెంగుళూరుకు సతీమణితో కలిసి వెళ్లిన జూ. ఎన్టీఆర్
వారితో కలిసి వెళ్లిన కళ్యాణ్ రామ్ దంపతులు
కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తో కలిసి ఆస్పత్రికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
తారకరత్నను చూడగానే జూ ఎన్టీఆర్ ఎమోషనల్
తారకరత్నకు బ్రాహ్మణి పరామర్శ
బెంగళూరు బయలుదేరిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
భార్యలతో కలిసి చార్టర్డ్ ఫ్లైట్ లో బెంగళూరుకు
తారకరత్న అనారోగ్యం కారణంగా తీవ్ర ఆందోళనలో నందమూరి అభిమానులు
తారకరత్న క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రత్యేక పూజలు
తారకరత్న ఆరోగ్యంపై మెగా హీరో ఎమోషనల్ పోస్ట్..
తారకరత్న ఆరోగ్యంపై సాయి ధరమ్ తేజ్ స్పందన
అన్నా త్వరగా కోలుకోవాలి' అంటూ సోషల్ మీడియో వేదికగా ఎమోషనల్ పోస్ట్
గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మెలేనా అనే వ్యాధితోనూ బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయం లోపలి రక్తస్రావానికి సంబంధించిన వ్యాధి అని ఈ వ్యాధి ఉండడం వలన రు, అన్నవాహిక, పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుందని గుర్తించారు. ఇక ఈ వ్యాధి ఉండడం వలన శరీరంలో రక్తస్థాయిలు తగ్గిపోయి బలహీనంగా మారిపోతారని, క్రమంగా అనీమియాకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీరం రంగు మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు తెలిపారు, దీంతో నిన్న ఆయన శరీరం రంగు మారి ఉండవచ్చని అంటున్నారు.
బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని నందమూరి కుటుంబ సభ్యులతో మాట్లాడిన టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, అనిత
బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను పరామర్శించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
తారకరత్నకు అందుతున్న చికిత్స పై డాక్టర్లతో మాట్లాడిన టీడీపీ అధినేత
అనంతరం తారకరత్న భార్య అలేఖ్య, తండ్రి మోహన కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పిన చంద్రబాబుతారకరత్నను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు
నిన్న తారకరత్న యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు
అక్కడ ఆయన స్పృహ తప్పి పడిపోయారు
వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రికి తరలించారు
ఎందుకైనా మంచిదని నారాయణ హృదయాలయ నుంచి కోఆర్డినేట్ చేసాం
ఇక్కడ నుంచి డాక్టర్లను అంబులెన్స్లను కుప్పం రప్పించాం
అక్కడికి వచ్చిన డాక్టర్లు మరి ఆలోచించి కుప్పం కంటే బెంగళూరు బెటర్ గా ఉంటుంది
అని చెప్పడంతో రాత్రి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకు వచ్చాం
ఇక్కడికి తీసుకు వచ్చినప్పటి నుంచి ఈ డాక్టర్లు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు
ఇంకా కొంత గ్యాప్ రావడం వంటివి ఉన్నాయి అందుకే అబ్జర్వేషన్ లో పెట్టారు
ఇప్పటికే డాక్టర్లు అన్ని చర్యలు తీసుకుంటున్నారు
ఆయన పూర్తిస్థాయిలో కోల్పోయిన తిరిగి రావాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను.
నేను డాక్టర్లతో మాట్లాడాను ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి ఐసీయూలో అబ్జర్వేషన్ లో పెట్టారు
ఇంకా కొంత సమయం పడుతుంది కానీ సమయానికి హాస్పిటల్ వాళ్లు కూడా మెడికల్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు
తారకరత్న వీలైనంత త్వరగా కోలుకుంటారని భగవంతుని ప్రార్థిస్తున్నాను
పురంధేశ్వరి: ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది
డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు
సోమవారం నాడు మరోసారి పరీక్షలు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారునారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న తారకరత్న తల్లిదండ్రులు శాంతి, మోహనకృష్ణ
ఆస్పత్రిలో ఇప్పటికే తారకరత్న భార్య రెడ్డి అలేఖ్య రెడ్డి, కూతురు నిషిత, నందమూరి బాలకృష్ణ
ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, నందమూరి సుహాసిని
ఆసుపత్రికి చేరుకున్న టీడీపీ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వర రావు, పరిటాల శ్రీరామ్
మరి కాసేపట్లో హృదయాలయ ఆసుపత్రికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఐసీయూలో తారకరత్నకు కొనసాగుతున్న వైద్య చికిత్సలు
తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయం
తారకరత్న ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్న ప్రత్యేక వైద్య బృందాలు
నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తారకరత్న వివాదాలకు దూరంగా ఉంటాడని, మంచి వ్యక్తి అని అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం గుర్తు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్న ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా గ్యారంటీ అనుకుంటున్న తరుణంలో గుండెపోటు రావడం బాధాకరమని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. #TarakaRatna హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ సినిమాలోని సూపర్ హిట్ పాటకి రీమిక్స్ చేశారు. పూర్తి పాటను జనవరి 29న సాయంత్రం 5:09 గంటలకి విడుదల చేయాల్సి ఉండగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
Taraka Ratna Health Bulletin: తారక రత్న ఆరోగ్యంపై నారాయణ హృదయాలయ హెల్త్ బులెటిన్ విడుదల
అత్యంత విషమ స్థితిలో ఈ తెల్లవారుజామున తారకరత్నను నారాయణ ఆస్పత్రికి తీసుకువచ్చారు
వెంటనే ఆయనకు అవసరమైన అత్యవసర చికిత్స అందించాము
తారకరత్నకు ప్రస్తుతం వివిధ విభాగాలు వైద్యుల సంరక్షణలో వైద్యం అందిస్తున్నాం
తారకరత్న పరిస్థితి విషమంగానే ఉంది
తారకరత్నకు రానున్న రోజుల్లో మరింత మెరుగైన వైద్యం అవసరం