Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా.. దుమ్ములేపేసిన ఆ రెండు సినిమాలు

Mon, 13 Mar 2023-9:31 am,

Oscars 2023 Live Updates: గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు గెలుచుకున్న `నాటు నాటు..` సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. మరి ఈ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వస్తుందా..? ఈసారి ఏ సినిమా ఆస్కార్ గెలుచుకోనుంది..? లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

Oscars 2023 Live Updates: ఆస్కార్ 2023 వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా జరిగే ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీతారలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుక  ఏబీసీలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఆస్కార్ అవార్డు వేడుకను ప్రముఖ కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ చేయనున్నారు. ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ పోటీ పడుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో రెండు భారతీయ డాక్యుమెంటరీలు కూడా ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లోకి వచ్చాయి.

Latest Updates

  • దుమ్ములేపేసిన ఆ రెండు సినిమాలు..

    ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమా ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో దుమ్ములేపేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టేసింది. ఇక ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ అనే సినిమాకు నాలుగు అవార్డులు వచ్చాయి. ఉత్తమ సంగీతం, ప్రొడక్షన్ డిజైనర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి.

  • మొట్టమొదటి ఏసియన్ వుమెన్.. నయా హిస్టరీ

    ఆస్కార్ అవార్డ్ అందుకున్న మొట్ట మొదటి ఏసియన్ మహిళగా మిచెల్లె యో నిలిచింది. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆమె ఈ అవార్డును అందుకుని నయా హిస్టరీని క్రియేట్ చేసింది.

  • ఉత్తమ నటుడు ఎవరంటే?

    ది వేల్ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా బ్రెండన్ ఫ్రాజర్‌కు అవార్డు వచ్చింది. బెస్ట్ సౌండ్ కేటగిరీలో టాప్ మావెరిక్ సినిమాకు అవార్డు వచ్చింది. డేనియల్ బ్రదర్స్‌కు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది.

  • దుమ్ములేపిసిన ఆర్ఆర్ఆర్

    నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట ఉత్తమ పాటగా నామినేట్ అయిన క్షణం నుంచి ఆస్కార్ వస్తుందనే అంతా నమ్మకంగా ఉన్నారు. చివరకు నాటు నాటు ఆస్కార్ అవార్డ్ గెలిచి.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ నయా చాప్టర్ ఏర్పర్చింది. ఇంత వరకు ఓ భారతీయ సినిమాకు గానీ, తెలుగు సినిమా పాటకు గానీ ఈ ఘనత దక్కలేదు.

  • బెస్ట్ స్క్రీన్ ప్లే ఏ సినిమాకు వచ్చిందంటే?

    బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమాకు గానూ డానీ బ్రదర్స్ (డానియల్ క్వాలన్, డానియల్ సాచినర్ట్‌)కు వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో అవార్దులు వచ్చిన సంగతి తెలిసిందే. అడాప్టెడ్‌ స్క్రీన్ ప్లే కేటగిరీలో వుమెన్ టాకింగ్ అనే సినిమాకు గానూ సారా పోల్లెకు అవార్డు వచ్చింది.

  • ఆస్కార్‌ను పట్టేసిన అవతార్ 2

    అవతార్ 2 సినిమా ఆస్కార్ అవార్డుల కోత మొదలెట్టేసింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవతార్ ది వే ఆఫ్ వాటర్‌కు అవార్డు వచ్చింది.

  • బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఏదంటే?

    ఉత్తమ సంగీతం కేటగిరీలో ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ అనే సినిమాకు గానూ వోల్కర్ బర్టెల్మన్‌కు ఈ అవార్డు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు మూడు అవార్డులు రాగా.. ఇది నాలుగో అవార్డు అయింది. ప్రొడక్షన్ డిజైనర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీల్లో అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.

  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ ఏ సినిమాకు వచ్చిందంటే?

    బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ అనే సినిమాకు వచ్చింది. ఇప్పటికే దీని ఖాతాలో బెస్ట్ కొరియోగ్రఫీ అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీల్లో అవార్డులు వచ్చి పడ్డాయి.

  • ఇండియాకు వచ్చిన ఆస్కార్

    ది ఎలిఫెంట్ విష్‌పరర్స్ అనే సినిమాకు బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఈ మూవీని కార్తికి గోన్‌సాల్వేస్, గునీత్ మోంగా సంయుక్తంగా తెరకెక్కించారు.

  • బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ ఫిల్మ్ ఏదంటే?

    ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ ఆండ్ ది హార్స్ అనే సినిమాకు ఉత్తమ యానిమేటెడ్ లఘు చిత్రంగా అవార్డు వచ్చింది.

  • జర్మనీ దేశానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం

    ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా జర్మనీ దేశానికి చెందిన ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్. ఈ మూవీకి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు వచ్చింది.

  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జేమ్స్ ఫ్రెండ్

    ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకు గాను జేమ్స్ ఫ్రెండ్ పని చేసిన తీరు, కొరియోగ్రఫీ చేసిన తీరుకు ఆయనకు ఆస్కార్ అవార్డు దక్కింది.

  • రెండు సార్లు గెల్చుకుని హిస్టరీ క్రియేట్ చేసిన బ్లాక్ మహిళ
    బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్ కేటగిరీలో రుత్ ఈ కార్టర్‌ రెండో సారి ఆస్కార్ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది. ఇలా రెండు సార్లు ఓ బ్లాక్ మహిళ ఆస్కార్ అవార్డులు గెలవడం హిస్టరీలోనే ఫస్ట్ టైం. బ్లాక్ పాంథర్ సినిమాకు గానూ ఈ అవార్డు వచ్చింది.

  • బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు కైవసం చేసుకున్నAll quiet on the western front

    95వ ఆస్కార్ అవార్డుల పోటీలో బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో All quiet on the western front, Bardo: False Chroniclke of a Handful of Truths, Elvis, Empire of Light, Tar సినిమాలు పోటీ పడగా..All Quiet on the western front సినిమాకు బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు దక్కింది. 
     

  • బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగరీలో ఆస్కార్ గెల్చుకున్న Navalny

    ఆస్కార్ 2023 వేడుకల్లో ఇండియాకు తొలి నిరాశ ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగరీలో భారతదేశానికి చెందిన ఆల్ దట్ బ్రీత్స్ వెనుకబడింది. ఈ విభాగంలో  Navalny ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. 

  • బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు గెల్చుకున్న An Irish Goodbye

    ఆస్కార్ 95 వేడుకల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో యాన్ ఐరిష్ గుడ్ బై బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. ఈ కేటగరీలో ఐదు సినిమాలు పోటీ పడినా..అన్నింటినీ వెనక్కి నెట్టి  An Irish Goodbye అవార్డు గెల్చుకుంది. 
     

  • Jamie lee curtis got best supporting actress award

    ఆస్కార్ అవార్డుల ప్రదానం ప్రారంభమైంది. ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎన్ వన్స్ సినిమా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్లెస్ అవార్డు దక్కించుకుంది జామీ లీ కర్టిస్ ఈ అవార్డు కైవసం చేసుకుంది. 

  • మొత్తం సినీ ప్రపంచం ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ వేడుక ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ డోల్బీ థియేటర్ వేదికగా జరుగుతున్న ఆస్కార్ వేడుకకు ప్రపంచ సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.

    నాటు నాటు పాటతో అదరగొట్టేసిన సింగర్లు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటికే వేదికకు చేరుకున్నారు. స్టైలిష్ దుస్తుల్లో వేడుకకు హాజరైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

  • బాలీవుడ్ నటి ఈషా గుప్తా ఆస్కార్ అవార్డు వేడకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ప్రియాంక చోప్రా, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తదితర స్టార్‌ నటులు ఈషా గుప్తాతో ఫోటోలలో ఉన్నారు.

     

  • ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పటికే తన ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే. ఆయన ఎవరికి ఓటు వేశారు..? 

    పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆస్కార్ అవార్డు అమ్మవచ్చా..? నిబంధనలేం చెబుతున్నాయి..? అమ్మితే ఎంత వస్తుంది..?

    పూర్తి వివరాల కోసం ఈ స్టోరీని చదవండి

  • సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఆస్కార్‌' 2023 నామినేషన్స్‌‌ ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. 2023 మార్చి 12న (భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 5.30 గంటలకు) రాత్రి లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో 2023 ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్‌ లిస్ట్ ఓసారి చూద్దాం. 

    పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • నాటు నాటు పాటకు ఆస్కార్ ఒక్కటే కాకుండా గ్రామీ అవార్డు కూడా దక్కాలని ఏఆర్ రెహమాన్ ఆకాంక్షించారు. ఆస్కార్, గ్రామీ అవార్డుల్లో ఏది వచ్చినా భారతదేశ కీర్తి మరింత పెరుగుతుందని ఏఆర్ రెహమాన్ అభిప్రాయపడ్డారు. రెహమాన్ ఆశించినట్టే నాటు నాటు పాట ఆస్కార్‌తో పాటు గ్రామీ అవార్డు గెల్చుకుంటుందని నెటిజన్లు ఆశిస్తున్నారు. 

    పూర్తి స్టోరీ ఇక్కడ చదవండి

  • ఉత్తమ నటుడి రేసులో ఉన్నది వీళ్లే..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    నటుడు - సినిమా

    ==> ఆస్టిన్ బట్లర్ - ఎల్విస్

    ==> కోలిన్ జేమ్స్ ఫారెల్ - ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్

    ==> బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్ - ది వేల్

    ==> పాల్ మెస్కల్ - ఆఫ్టర్ సీజన్

    ==> బిల్ నైజీ - లివింగ్

  • గతేడాది ఉత్తమ చిత్రంగా కోడా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ నటిగా జెస్సికా చస్టెయిన్‌, ఉత్తమ నటుడు విల్‌ స్మిత్‌లు నిలిచారు. మరీ ఈ ఏడాది ఎవరు గెలుచుకోనున్నారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. 

  • ప్రస్తుతం ఆస్కార్ 2023 కోసం యూఎస్‌ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈవెంట్‌కు ముందు అభిమానులతో ముచ్చటించారు.

     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link