Oscar Awards 2023: ఆస్కార్ అవార్డు అమ్మవచ్చా, నిబంధనలేం చెబుతున్నాయి, అమ్మితే ఎంత వస్తుంది

Oscar Awards 2023: ఆస్కార్ అవార్డుల వేడుక సమయం వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ఆస్కార్ ఎవరెవర్ని వరించేది తేలిపోనుంది. ప్రపంచ సినీ పరిశ్రమలో ఇదే అత్యుత్తమ అవార్డు కావడంతో ఆస్కార్ అంటే క్రేజ్ ఎక్కువ.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2023, 10:30 AM IST
Oscar Awards 2023: ఆస్కార్ అవార్డు అమ్మవచ్చా, నిబంధనలేం చెబుతున్నాయి, అమ్మితే ఎంత వస్తుంది

Oscar Awards 2023: ప్రపంచంలో వివిధ రంగాల్లో అత్యున్నత అవార్డు నోబెల్ ఎలానో..సినీ రంగంలో అత్తున్నత అవార్డు ఆస్కార్. ఆస్కార్ 2023 వేడుకలు మరి కొద్దిగంటల్లోనే ప్రారంభం కానున్నాయి. ఈసారి బరిలో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఉండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది.

ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యున్నత అవార్డు ఆస్కార్. 1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీలు ఈ అవార్డును అకాడమీ అవార్డ్స్ పేరుతో ప్రారంభించారు. సినీ పరిశ్రమలో ప్రతిభ కనబర్చినవారికి ఈ అవార్డు అందించేవారు. కాలక్రమంలో ఇదే అత్యున్నత పురస్కారంగా మారిపోయింది. అలాంటి ఈ ఆస్కార్ అవార్డును అమ్ముకునే పరిస్థితి ఉంటుందా..ఒకవేళ ఉంటే ఎంత వస్తుందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.

ఆస్కార్ అవార్డూ చూడ్డానికి బంగారు రంగులో బంగారంతో చేసినట్టున్నా..బంగారం కాదు. 30.5 అంగుళాల ఎత్తు, 4 కిలోల బరువుండే ఈ అవార్డు కాపర్‌తో తయారై..ఆ తరువాత బంగారం పూత పూస్తారు. ఆస్కార్ అవార్డు తయారు చేసేందుకు 400 డాలర్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. కానీ అమ్మితే మాత్రం ఒకే ఒక్క డాలర్ వస్తుందట. 1950లో అకాడమీ ప్రవేశపెట్టిన నిబంధనే ఇందుకు కారణం. 

1950కు ముందు ఓ అమెరికన్ డైరెక్టర్ తాను గెల్చుకున్న ఆస్కార్ అవార్డును వేలం వేయగా..ఏకంగా ఆరున్నర కోట్లు వచ్చాయతనికి. ఈ విషయం తెలిసి ఆగ్రహించిన అకాడమీ అవార్డ్స్ కమిటీ ఎవరూ ఆస్కార్ అవార్డు అమ్మకుండా ఓ నిబంధన ప్రవేశపెట్టింది. ఒకవేళ ఎవరైనా అమ్మాలనుకుంటే లేదా వేలం వేయాలంటే ఆ హక్కు కేవలం అకాడమీకే ఉంటుంది. అది కూడా 1 డాలర్ మాత్రమే విలువ కట్టారు. అంటే ఆస్కార్ అవార్డు అమ్మితే కేవలం 82 రూపాయలే వస్తాయి. 

Also read: Oscar Awards 2023: ఆస్కార్ వేడుక ఎన్ని గంటలకు ఎప్పుడు, లైవ్ స్ట్రీమింగ్ ఎందులో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News