Issues For Pushpa the Rule: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్, ఫహద్ ఫాజిల్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా విడుదలైన తర్వాత భారీ వసూళ్లు కూడా సాధించింది. ఈ నేపథ్యంలోనే రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ రెండవ భాగం షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలో కాస్త సందిగ్దత ఏర్పడింది. దానికి కారణం షూటింగ్ లొకేషన్స్ విషయంలో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే. సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అయితే 'పుష్ప' యూనిట్ లొకేషన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి మొదటి భాగాన్ని ముందు థాయ్ లాండ్ తరువాత కేరళలో షూట్ చేయాలని అనుకున్నా అప్పటి పరిస్థితుల రీత్యా ఎక్కువ మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించారని అందరికీ తెలుసు.


ఇప్పుడు అదే లొకేషన్స్ లో షూటింగ్ జరపాలంటే ఆ ఫారెస్ట్ రేంజ్ లో విపరీతమైన వర్షం అడ్డంకిగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ అనేది కష్టమైన విషయం అని భావిస్తున్నారు. అలాగే సుకుమార్ ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే మొదటి భాగాన్ని చిత్రీకరించిన అదే లొకేషన్లలో మళ్ళీ షూట్ చేస్తే లొకేషన్స్ రిపీట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడప్పుడే షూటింగ్ కు అనుకూలంగా మారేడుమిల్లి ప్రాంతం అయితే కాదని భావిస్తున్నారని అంటున్నారు.


ఇక  గతంలో కరోనా కేసులు కారణంగా కేరళ అడవుల్లో చేయాల్సిన షూటింగ్ ఇక్కడ మారేడుమిల్లి అడవిలో జరిపారు. అలాగే థాయిలాండ్ అడవుల్లో కూడా షూటింగ్ జరపాలని భావించారు కానీ కరోనా కాలంలో అంత మందికి వీసాలు దొరకడం కష్టమని భావించి వెనకడుగు వేశారు. ఇప్పుడు మళ్లీ మారేడుమిల్లి ఇబ్బందుల నేపథ్యంలో సుకుమార్ ఈసారి ఏం చేయబోతున్నారు అని ఆసక్తికరంగా మారింది. 


Read Also: Roopa Vaitla Divorce: విడాకుల నిర్ణయం వెనుక సమంత.. అసలు ఏం జరిగిందంటే?


Read Also: Nabha Natesh: అబ్బా అనిపిస్తున్న నభా.. హాట్ ట్రీట్ ఇచ్చేసిందిగా!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook