Love Story in Aha: క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములు(sekhar kammula) తెరకెక్కించిన చిత్రం 'లవ్ స్టోరీ'. నాగచైతన్య(Nagachaitanya), సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. గత రెండెళ్లుగా థియేటర్లకు దూరంగా ఉన్న ఆడియన్స్‏ను భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ 24న విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి(Sai Pallavi)ల జోడీకి ప్రేక్షకులను ఫిదా అయ్యారు. విడుదలైన మొదటి రోజునే.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.


Also read: Prabhas Remuneration: ఆ సినిమాకు ప్రభాస్ షాకింగ్ రెమ్యూనరేషన్ !


మరోసారి లవ్ స్టోరీ సినిమా(Love story Movie) ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా(Aha).. ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తూ టాప్ ప్లేస్‏లో దూసుకుపోతున్న ఓటీటీ(OTT) మాధ్యమం.. ఆహా మరోసారి అందమైన ప్రేమకథను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. నాగచైతన్య, సాయిపల్లవిలు జోడీగా నటించిన లవ్ స్టోరీ సినిమా అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ తన ట్విట్టర్(Twitter) ఖాతా ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా.. లవ్ స్టోరీ ట్రైలర్ సైతం విడుదల చేసింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి