Maa Awara Zindagi Movie Review and Rating: దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ ఫేమ్ చెర్రీ, జస్వంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ మా ఆవారా జిందగీ. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడ్యూసర్ నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించారు. 100% ఫన్ 0% లాజిక్  అనే క్యాప్షన్‌తో ఈ సినిమా శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమా ఎలా ఉండబోతోందో మేకర్లు క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమా రివ్యూ ఏంటో ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ ఏంటంటే..?


భట్టి (శ్రీహాన్), సీబీ (జబర్దస్త్ అజయ్), ఎల్బీ (చెర్రీ), లంబు (జస్వంత్)లు ఫ్రెండ్స్. పనీపాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. ఇంట్లో ఎన్ని చీవాట్లు పెడుతున్నా పట్టించుకోకుండా ఆవారాల్లా తిరుగుతుంటారు. అమ్మాయిలను ఏడిపిస్తూ, రోడ్ల మీద మందు తాగుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటారు. ఎస్సై రెడ్డి (షాయాజీ షిండే) ఈ నలుగురిని కొడుతూ.. తిడుతూ ఉంటాడు. కానీ వాళ్లు మాత్రం మారరు. ఒకసారి ఎస్సై కూతురు కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు..? ఆ నలుగురు కుర్రాళ్లు చేసిన పనులేంటి..? చివరకు ఆ అమ్మాయిని ఎలా కాపాడారు..? అనేది తెలుసుకోవాలంటే మా ఆవారా జిందగీ మూవీని చూడాల్సిందే..


ఎవరు ఎలా నటించారు..?


భట్టి పాత్రలో శ్రీహాన్ , సీబీగా జబర్దస్త్ అజయ్, ఎల్బీగా చెర్రీ, లంబుగా జస్వంత్‌లు తెరపై నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించారు. తెలంగాణ యాసతో అలరిస్తూ.. కామెడీ పండించడంలోనూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. శ్రీహాన్, అజయ్‌ల కామెడీ సీన్లు ప్రేక్షకులను ఎక్కువగా నవ్వించాయి. ఈ నలుగురు చేసిన పాత్రలు ఆద్యంతం నవ్విస్తాయి. ఎస్సైగా షాయాజీ షిండే, విలన్ పాత్రలో టార్జాన్‌ ఓకే అనిపిస్తారు. మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి.


విశ్లేషణ


మా ఆవారా జిందగీ సినిమాతో డైరెక్టర్ ఎన్నో విషయాలను అంతర్లీనంగా టచ్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రస్తుత సమాజంలో యువత ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యలను తెరపై చాలా చక్కగా చూపించాడు. ఉద్యోగం, పెళ్లి విషయంలో యువత పడుతున్న కష్టాలను వినోదాత్మకంగా చూపించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో అడల్ట్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. కథ, కథనాలను దర్శకుడు ఎంతో చక్కగా నడిపించాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లాడు.


మా ఆవారా జిందగీని ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నడిపిస్తే.. సెకండ్ హాఫ్‌ను అడల్ట్ కామెడీతో ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలోనే ప్రేక్షకులు ఎక్కువగా నవ్వుకుంటారు. వేశ్య దగ్గర వచ్చే సీన్లు, మసాజ్ సెంటర్లో ఉండే సన్నివేశాలు ఆడియెన్స్‌ను అలరిస్తాయి. క్లైమాక్స్ సైతం రొటీన్‌గా కాకుండా కాస్త నేచురాలిటీకి దగ్గరగా తీశాడు. ఆవారాలంటే చివరి ఫ్రేమ్ వరకు అలానే చూపించారు.


సాంకేతికంగా మా ఆవారా జిందగీ సినిమా అందరినీ మెప్పిస్తుంది. ఆర్ఆర్ మూడ్‌కు తగ్గట్టుగా ఉంటూ నవ్విస్తుంది. మాటలు మెప్పిస్తాయి. కొన్ని చోట్ల బూతు డైలాగ్‌లు కూడా ఉంటాయి. కానీ బీప్‌లతో సెన్సార్ కట్‌ వేసింది. ఎడిటింగ్‌ బాగుంది. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చింది. కెమెరా వర్క్ బాగుంది. నేచురల్‌ లొకేషన్‌లో సినిమాను తీయడం కలిసి వచ్చింది. యూత్‌ ఆడియెన్స్‌ను మా ఆవారా జిందగీ బాగానే మెప్పించే అవకాశం ఉంది.


రేటింగ్ 2.75/5


Also Read: Nora Fatehi: అందాల బాంబ్ పేల్చిన నోరా ఫతేహి.. హాట్ ట్రీట్ అదుర్స్  


Also Read: TS PECET 2023 Results: రేపు టీఎస్‌పీఈ సెట్-2023 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి