MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA Elections) నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల నటి హేమ(Hema) చేసిన ఆరోపణలపై ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌(Naresh), జనరల్‌ సెక్రటరీ జీవితా రాజశేఖర్‌(Jeevita Rajasekhar) కౌంటర్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హేమ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన తప్పుబడుతూ...పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ(Hema) మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆమెపై క్రమోశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కరోనా(Corona) దృష్ట్యా 'మా' ఎన్నికలు(MAA Elections ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.


Also Read: మా అసోసియేషన్ ఎన్నికలు: నరేష్‌పై హేమ సంచలన ఆరోపణలు


ఈ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరగనున్న 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు(Manch Vishnu) ప్రకటించడం వల్ల ఒక్కసారిగా అందరి చూపు వీటిపై పడింది. 'మా(MAA)'కు శాశ్వత భవనం ఏర్పాటు అనే నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌(Prakashraj) తన ప్యానెల్‌ను ప్రకటించగా.. విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.


నరేశ్ పై హేమ చేసిన వ్యాఖ్యలు
‘‘'వెంటనే ‘మా’ ఎన్నికలు జరగాలి. కొత్త కమిటీ ఏర్పడాలి. నరేష్(Naresh) ఇప్పటి వరకు ‘మా’ కోసం సంపాదించింది ఏమీ లేదు. ఇందుకు ముందు ఉన్నవారు ఫండింగ్ చేసిన అమౌంట్‌నే ఆయన ఖర్చు చేస్తున్నారు. అదనంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఎన్నికలు జరగాలని కోరుతూ క్రమశిక్షణా సంఘానికి లెటర్ రాయాలని నా స్నేహితులకు వాయిస్ మెసేజ్ చేశాన'ని హేమ తెలిపారు.  


Also Read:Prakash Raj, MAA elections: మా అసోసియేషన్‌ ఎన్నికల్లో నాన్-లోకల్ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ ఫైర్


ఇంతక ముందు వరకు మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లే ఈ ‘మా’ ఎన్నికల విషయంలో హైలెట్ అవుతూ, వారి మధ్యనే పోటీ అనేలా వాతావరణం క్రియేట్ అవుతోంది. ఇటీవల నటి హేమ(Hema) చేస్తున్న వ్యాఖ్యల కారణంగా ఎన్నికలు కొత్త మలుపు తిరగబోతున్నాయని అర్థమవుతోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook