MAA Elections 2021 : మా ఎన్నికల్లో ముందంజలో మంచు విష్ణు ప్యానల్, శివబాలాజీ విజయం
MAA Elections 2021 Counting Live Updates : మంచు విష్ణు ప్యానల్‌లో 10మంది ఈసీ సభ్యులు లీడ్‌లో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8మంది లీడ్‌లో ఉన్నారు. ఇక ఈ లీడ్స్ ఎప్పటికప్పడు మారుతూ ఉత్కంఠ రేపుతోంది.
MAA Elections 2021 counting elections result updates prakash raj vs manch vishnu panel lead list here: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో (MAA Elections) కౌంటింగ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఈసీ మెంబర్ల కౌంటింగ్‌లో మంచు విష్ణు ప్యానల్‌లో 10మంది ఈసీ సభ్యులు లీడ్‌లో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8మంది లీడ్‌లో ఉన్నారు. ఇక ఈ లీడ్స్ ఎప్పటికప్పడు మారుతూ ఉత్కంఠ రేపుతోంది.
మంచు విష్ణు ప్యానల్ (manch vishnu panel) నుంచి మంచు విష్ణు ప్యానల్ నుంచి 10మంది ఈసీ సభ్యులు.. మాణిక్, హరినాథ్, బొప్పన,శివ, జయవాణి, శశాంక్, పూజిత, పసునూరి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ లీడ్‌లో ఉన్నారు.
ఇక ఆఫీస్ బేరర్ల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ల ఓట్లను లెక్కిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా మంచు విష్ణు ప్యానల్ నుంచి బాబూమోహన్( Babumohan).. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ (Srikanth) పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీకాంత్ విజయం సాధించారు.
Also Read : Breaking news: 'మా' ఎన్నికల్లో తొలి ఫలితం..బోణీ కొట్టిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్
ట్రెజరర్లుగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి నాగివీడు, మంచు విష్ణు ప్యానల్ నుంచి శివ బాలాజీ పోటీ చేశారు. ఇందులో శివబాలాజీ (Shiva Balaji) గెలుపొందారు. ఇక జీవితపై రఘుబాబు కేవలం ఏడు ఓట్లతో గెలుపొందారు. మరికాసేపట్లో మిగతా ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
మా ఎన్నికల ( Maa Elcetions) ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్లలో మంచు విష్ణు ముందంజలో ఉన్నారు. మొత్తం 665 ఓట్లు పోలవగా ఇందులో పోస్టల్ బ్యాలెట్ నుంచి 60 ఓట్లు పోలయ్యాయి. మోహన్ బాబు, మురళీ మోహన్ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాతోంది. అయితే ఈసీ మెంబర్లలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read : MAA Elections 2021 : వాటమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా అంటూ విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లపై మంచు మనోజ్ సెటైర్