MAA Elections 2021: ముగిసిన మా ఎన్నికలు, ఓటు వేయని స్టార్ హీరోలు
Star Heroes not attended on MAA elections : మా ఎన్నికలకు పలువురు అగ్ర హీరోలు హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ,బాలకృష్ణతో పాటు నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి కొందరు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ......
MAA Elections 2021 Star Heroes not attended on MAA elections : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Movie Artists Association elections) (మా) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 3 గంటలకు పైగానే వరకు కొనసాగింది. రెండు గంటలకే పోలింగ్ (polling) ముగియాల్సి ఉన్నా.. అప్పటికే క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించడంతో కాస్త ఆలస్యమైంది. ఇక గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఈ సారి 83శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గతేడాది కేవలం కేవలం 474 మంది మాత్రమే ఓటు (Vote) హక్కు వినియోగించుకున్నారు.
మా ఎన్నికలకు పలువురు అగ్ర హీరోలు హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, (chiranjeevi) పవన్ కల్యాణ్ (pawan kalyan), బాలకృష్ణతో (balakrishna) పాటు నాగార్జున (nagarjuna), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి కొందరు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరోయిన్ జెనీలియా (genelia) కూడా ‘మా’లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read : MAA Election Polling: మా ఎన్నికల్లో భారీగా పోలింగ్, నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
అయితే ఈసారి మా ఎన్నికల్లో ఓటు వేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) , ప్రభాస్ (Prabhas), వెంకటేశ్ (Venkatesh), అల్లు అర్జున్, (Allu Arjun), మహేశ్‌బాబు ( Mahesh Babu), నితిన్, రానా, రవితేజ, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలు రాలేదు. వీరంతా షూటింగ్స్‌లో బిజీగా ఉండటంతో ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తుంది. ఎంతో ఉత్కంఠగా సాగిన మా ఎన్నికలకు (MAA Elections) ఈసారి స్టార్ హీరోలంతా హాజరై ఓటు వేస్తారని అందరూ అనుకున్నారు. కానీ కొందరు ప్రముఖ హీరోలు మాత్రం హాజరుకాలేకపోయారు.
Also Read : Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ ప్రీత్ సింగ్..త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న రకుల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook