Manchu Manoj meets Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ భేటీ అయ్యాడు. హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ మూవీ షూటింగ్‌లో (Bheemla Nayak shooting) బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ని మంచు మనోజ్ అక్కడికే వెళ్లి కలిశాడు. దాదాపు గంటకుపైగా వీళ్లిద్దరూ కలిసి చర్చించుకున్నారు. ఈ భేటీలో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రముఖంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో (MAA association elections) చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు, నటీనటుల మధ్య జరిగిన వాగ్వీవాదాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మా అసోసియేష్ ఎన్నికల్లో (MAA elections) సినీ ప్రముఖులు ఎప్పటిలాగే ఈసారి కూడా రెండు వర్గాలుగా విడిపోయి సవాళ్లు-ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీచేసిన మంచు విష్ణు ప్యానెల్ మెగా ఫ్యామిలీపై పలు ఆరోపణలు చేసిందనే వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. ఇంకా చెప్పాలంటే మా ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై మంచు విష్ణు ప్యానెల్ (Manchu Vishnu pannel) దిగజారుడు వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణలు మెగా శిబిరం నుంచి వినిపించాయి. 



Also read : Manchu Vishnu: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నా..మెగాస్టార్‌‌ని కలుస్తా- మంచు విష్ణు


ఈ విషయంలో మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ పుష్కలంగా ఉన్న ప్రకాశ్ రాజ్ సైతం మంచు విష్ణు ప్యానెల్‌పై, మంచు ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు చేసే సినిమాల బడ్జెట్ మొత్తం కలిపినా.. పవన్ కల్యాణ్ సినిమాల ఫస్ట్ డే మార్నింగ్ షోల కలెక్షన్స్ అంత ఉండవు అంటూ మంచు ఫ్యామిలీని ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఎద్దేవా చేశారు. 


ఇలా మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి బాగా దూరం పెరిగింది అని అనుకుంటున్న తరుణంలోమే మా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు వెళ్లి బాలయ్య బాబుతో భేటీ (Manchu Vishnu meets Balakrishna) అవడం చర్చనియాంశమైంది. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలోనే మంచు మనోజ్ వెళ్లి పవన్ కల్యాణ్‌తో (Manchu Manoj meets Pawan Kalyan) భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


Also read : Bheemla Nayak song : భీమ్లా నాయ‌క్ నుంచి మరో సాంగ్‌, ప్రోమో రిలీజ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook