Bheemla Nayak song : భీమ్లా నాయ‌క్ నుంచి మరో సాంగ్‌, ప్రోమో రిలీజ్‌

Bheemla Nayak second single song: భీమ్లా నాయక్ నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది. అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నామీద అనే సాంగ్ ప్రోమోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 12:24 PM IST
  • భీమ్లా నాయక్ నుంచి మరో సాంగ్
  • అంత ఇష్టం ఏందయ్యా సాంగ్ ప్రోమో రిలీజ్
  • అక్టోబర్ 15న 'అంత ఇష్టమేందయ్యా' అనే లిరికల్ సాంగ్‌
Bheemla Nayak song : భీమ్లా నాయ‌క్ నుంచి మరో సాంగ్‌, ప్రోమో రిలీజ్‌

Bheemla Nayak second single song Antha Istam song promo out : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, (PawanKalyan) దగ్గుబాటి రానా (RanaDaggubati) హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది. అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నామీద అనే సాంగ్ ప్రోమోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. మలయాళంలో సూపర్ హిట్‌ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్‌ను (Bheemla Nayak) రూపొందిస్తున్నారు. 

ఈ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్, (Nithya Menen) సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భీమ్లా నాయక్ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందుస్తున్నారు. సాగర్ కె చంద్ర ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

Also Read : Manmohan Singh health condition : నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోదీ ట్వీట్‌

ఇక ఇంతకముందు పవన్ పుట్టిన రోజు కానుకగా భీమ్లా నాయక్ నుంచి టైటిల్ సాంగ్ రిలీజైంది. ఆ పాటకు ఫ్యాన్స్ నుంచి ఒక రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. సోషల్‌ మీడియాను దున్నేసింది ఆ సాంగ్. ఇదే క్రమంలో దసరా (Dussehra) పండుగ సందర్భంగా అక్టోబర్ 15న 'అంత ఇష్టమేందయ్యా' అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతోంది మూవీ యూనిట్. 

ఇందులో భాగంగానే సాంగ్ ప్రోమోను రిలీజ్‌ చేశారు. ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే పాటను ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాయగా.. సింగర్‌ చిత్ర ఆలపించారు. ఈ మూవీలో పవన్‌ కల్యాణ్‌ (PawanKalyan) పోలీసు ఆఫీసర్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా, రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Also Read : AP Theatres : ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్‌కు అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News