Manchu Vishnu: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నా..మెగాస్టార్‌‌ని కలుస్తా- మంచు విష్ణు

MAA President Manchu Vishnu Meets Balakrishna: మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ను క‌లిశారు. తాను బాల‌కృష్ణ ఆశీర్వాదం తీసుకోవ‌డానికి వెళ్లినట్లు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 01:38 PM IST
  • త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి బాల‌కృష్ణ‌ను క‌లిసిన మంచు విష్ణు
  • మెగాస్టార్‌ చిరంజీవిని కలుస్తా..
  • ఈ నెల 16న ప్యానల్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం
  • మంచు విష్ణు వెల్లడి
Manchu Vishnu: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నా..మెగాస్టార్‌‌ని కలుస్తా- మంచు విష్ణు

MAA Elections 2021 MAA President Manchu Vishnu Mohan Babu Meets Balakrishna: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ‘మా’ ఎలక్షన్స్ (MAA Elections) హాట్‌ టాపిక్‌గా మారాయి. మా ఎన్నికలు ఎంతో హడావిడిగా సాగాయి. ఎలక్షన్స్ రోజు.. ఫలితాల వెల్లడయ్యాక కూడా వివాదాలు సాగుతూనే ఉన్నాయి. మొత్తానికి మా ఎన్నికల్లో విజయం సాధించి మంచు విష్ణు ప్రెసిడెంట్ అయ్యారు. 

తర్వాత ప్రకాష్ రాజ్, (Prakash Raj Resigns) నాగబాబులు ‘మా’కి రాజీనామా చేయడం.. ప్రకాష్ రాజ్ ప్యానల్ (prakash raj panel) నుంచి గెలిచిన వారంతా రాజీనామా చేయడంలాంటి విషయాలతో మాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మా కొత్త అధ్యక్షుడు (maa president) మంచు విష్ణు ఇవేమీ పట్టించుకోకుండా ‘మా’ ప్రెసిడెంట్ గా ప్రమాణం స్వీకారం చేశారు. అంతేకాదు తన పనులు తాను చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నారు. 

Also Read : Viral Video: ఏనుగు కోపాన్ని చూసి..మీరు తట్టుకోగలరా?

మంచు విష్ణు ఈ రోజు త‌న తండ్రి మోహ‌న్ బాబుతో (Mohan Babu) క‌లిసి హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ను క‌లిశారు. తాను బాల‌కృష్ణ ఆశీర్వాదం తీసుకోవ‌డానికి వెళ్లినట్లు తెలిపారు. మా ఎన్నిక‌ల్లో మొద‌టి నుంచి తనకు బాలకృష్ణ (Balakrishna) స‌హ‌క‌రించారని మంచు విష్ణు వెల్లడించారు. అలాగే ఇప్ప‌టికే తాను కోట శ్రీ‌నివాస‌రావు, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, కృష్ణంరాజు, (krishnam raju) ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ లాంటి వారిని క‌లిశానని చెప్పారు మంచు విష్ణు. 

Also Read : Fuel rates today: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న Petrol, డీజిల్ ధరలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద‌లందర్నీ తాను క‌లుస్తానని, అంద‌రినీ క‌లుపుకుని ముందుకు వెళ్తానని విష్ణు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవిని (megastar chiranjeevi) కూడా కలుస్తానని చెప్పారు. ఈ నెల 16న ఎన్నికల అధికారి తన ప్యానల్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని వెల్లడించారు. ఇక రాజీనామాలపై ఈసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని విష్ణు (Vishnu) పేర్కొన్నాడు. ఇక ఎన్నికల్లో విష్ణుకు బాలకృష్ణ ఎంతో అండగా నిలిచారని, విష్ణు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారని మోహన్‌ బాబు (Mohan Babu) తెలిపారు.

Also Read : Bheemla Nayak song : భీమ్లా నాయ‌క్ నుంచి మరో సాంగ్.. అంత ఇష్టం ఏందయ్యా పాట ప్రోమో రిలీజ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x