Manchu Vishnu press meet on MAA elections results 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో స్టార్ హీరోలైన డార్లింగ్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో (Allu Arjun MAA elections) పాటు ఇంకొంత మంది హీరో, హీరోయిన్స్ తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇదే విషయమై మంచు విష్ణు స్పందిస్తూ... ఓటింగ్‌లో పాల్గొన వారిలో కొంతమంది షూటింగుల్లో ఉన్నారని, ఇంకొందరు వారి వారి వ్యక్తిగత కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనని వారిని తానేమీ తప్పుబట్టడంలేదన్న విష్ణు.. సినిమానే తమకు అన్నం పెడుతోంది కనుక సినిమా షూటింగుల్లో పాల్గొనడాన్ని తాను తప్పుగా భావించనని అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయకపోవడం గురించి విష్ణు ప్రస్తావిస్తూ.. తాను భారీ ఆధిక్యంతో గెలిచానని తెలిశాకా అందరి కంటే ముందుగా తనకు మొట్టమొదట ఫోన్ చేసి విష్ చేసింది తారకేనని తెలిపారు. "నా తమ్ముడు తారక్ మద్దతు (Jr Ntr stand in MAA elections) నాకు ఎప్పుడూ ఉంటుందనే సంగతి నాకు తెలుసు. అలాగే తారక్ మా ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో కూడా నాకు తెలుసు. అది పర్సనల్ మేటర్ కనుక ఆ విషయాన్ని బయటికి చెప్పను" అని అన్నారు.


Also read : Prakash Raj resigns: మా అసోసియేషన్‌కు ప్రకాశ్ రాజ్ రాజీనామా


మా అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ (Prakash Raj resigns) నుంచి పోటీ చేసి గెలిచిన శ్రీకాంత్‌తో కూడా తమకు ఎలాంటి విభేదాలు లేవని విష్ణు తేల్చిచెప్పారు. ఎన్నికలకు ముందు ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు రెండు వర్గాలుగా విడిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu press meet latest) ఈ వివరణ ఇచ్చారు.


Also read : MAA Elections 2021: 'అంకుల్ తొందరపడొద్దు'...ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాపై విష్ణు స్పందన


Also read : MAA Elections 2021: మెగాబ్రదర్ సంచలన నిర్ణయం..'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook