MAA Elections 2021: 'అంకుల్ తొందరపడొద్దు'...ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాపై విష్ణు స్పందన

MAA Elections 2021: 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 'మా' ప్రాథమిక సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2021, 04:20 PM IST
MAA Elections 2021: 'అంకుల్ తొందరపడొద్దు'...ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాపై విష్ణు స్పందన

MAA Elections 2021: 'మా' ఎన్నికల్లో(MAA Elections) అధ్యక్షుడిగా ఓటమి అనంతరం ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది బాధతో చేస్తున్న రాజీనామా కాదని, ‘అతిథిగా వచ్చాను.. అతిథిగా ఉండాలి’ అనే ఉద్దేశంతో చేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు(Manchu Vishnu)కు సందేశం పంపారు. దీనిపై మంచు విష్ణు రిప్లై ఇచ్చి, ఆ స్క్రీన్‌షాట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

'డియర్‌ విష్ణు, ‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు. ‘మా’ను నడిపించేందుకు అవసరమైన శక్తినంత పొందాలని కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్‌-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ' అని ప్రకాశ్‌రాజ్‌’ మెస్సేజ్‌ పంపగా, అందుకు విష్ణు రిప్లై ఇచ్చారు.

Also read: MAA Elections 2021: మెగాబ్రదర్ సంచలన నిర్ణయం..'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

'మీరు తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దు. మా కుటుంబలో మీరూ భాగమే. కలిసి పనిచేయడానికి మీ ఆలోచనలకు మాకు అవసరం. మీరు ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వొద్దు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. లవ్‌ యు అంకుల్‌. దయచేసి తొందరపడొద్దు'’’ అని విష్ణు పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News