Maa Nanna Super Hero Movie Review: ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ రివ్యూ.. సుధీర్ బాబు మూవీ మెప్పించిందా..!
Maa Nanna Super Hero Movie Review: తెలుగులో సుధీర్ బాబు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ కోవలో ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. మరి ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
నటీనటులు: సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయి చంద్, ఆర్నా వోహ్రా, విష్ణు, రాజు సుందరం తదితరులు
ఎడిటర్: పి.అనిల్ కుమార్
సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి
సంగీతం: జై క్రిష్
నిర్మాత: సునీల్ బలుసు
రచన, దర్శకత్వం: అభిలాష్ కంకర
విడుదల తేది: 11-10-2024
ఈ సారి బతుకమ్మ పండక్కి అర డజనకు పైగా సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. వీటిలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలున్నాయి. ఈ కోవలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. నాన్న సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీడియా కోసం స్పెషల్ ప్రీమియర్స్ వేసారు. మరి ఈ నాన్న.. నిజంగానే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరోగా నిలిచాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
ప్రకాష్ (సాయి చంద్) ఓ లారీ డ్రైవర్.అతని భార్య ఓ బిడ్డకు జన్మించి కన్నుమూస్తోంది. లారీ డ్రైవర్ కాబట్టి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో చంటి పిల్లాడైన తన బిడ్డను అనాథాశ్రమంలో ఉంచి వెళుతుంటాడు. ఈ క్రమంలో అతని లారీలో అతనికి తెలియకుండా గంజాయ్ స్మిగ్లింగ్ జరగుతుంది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. సాక్ష్యాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఉండటంతో కోర్టు దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల యావజ్జీవ శిక్ష విధిస్తుంది. దీంతో అతని పిల్లగాడు అనాథశ్రమంలో జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్దవాడు అవుతాడు. ఆ తర్వాత అతన్ని శ్రీనివాస్ అనే స్టాక్ బ్రోకర్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. అతను శ్రీనివాస్ ఫ్యామిలీలో అడుగుపెట్టినప్పటి నుంచి వాళ్ల కుటుంబంలో అనుకోని సంఘటనలతో దివాళా తీస్తాడు. దీంతో పెంపుడు కొడుకుపై కోపం పెంచుకుంటాడు. కానీ జానీకి మాత్రం తనను పెంచి పెద్ద చేసిన తండ్రి అంటే చచ్చేంత ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలో శ్రీనివాస్ ఓ పొలిటికల్ లీడర్ కు దాదాపు రూ. కోటి బాకీ పడతాడు. ఆ బాకీ తీర్చడానికి జానీ ఏం చేసాడు. ఈ క్రమంలో అతని అసలు తండ్రి ప్రకాష్ జైలు నుండి విడుదలవుతాడు.ఈ క్రమంలో జానీ, తన కన్నతండ్రిని కలుసుకున్నాడా.. మరోవైపు పెంపుడు తండ్రి బాకీని జానీ ఎలా తీర్చాడనేదే ఈ సినిమా కథ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగులో తండ్రీ కొడుకులు అనుబంధం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. అందులో మెజారిటీ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ టైటిల్ తోనే ఈ సినిమా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఇక దర్శకుడు అభిలాష్ రెగ్యులర్ తండ్రీ కొడుకుల కథను కాకుండా... ఢిఫరెంట్ స్టోరీతో ఉన్న కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. దాన్ని తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకోవాలి. కొడుకు కోసం ఏమైనా చేసే తండ్రి.. అనుకోని కారణాలతో కొడుకుకు దూరం అవ్వడం. మరోవైపు అనాథాశ్రమంలో పెరిగిన అతన్ని మరో అతను దత్తత తీసుకోవడంతో ఆ అబ్బాయికి అతనిపై అలవి కానీ ప్రేమ ఏర్పడుతుంది.
మరోవైపు దత్త పుత్రుడు రాకతో పెంచిన తండ్రి ఇంట్లో అనుకోని అవాంతరాలు ఏర్పడటం. దాంతో ఇతను దురదృష్టవంతుడని పెంచిన తండ్రి దూరం పెట్టడం. అయినా.. అనాథ అయిన తనను పెంచి పెద్ద చేసిన పెంపుడు తండ్రిపై కుమారుడి అనురాగం సగటు కామన్ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యేవిధంగా తెరకెక్కించాడు. ఇక పెంపుడు తండ్రి బాకీ తీర్చడానికి కుమారుడు ఏం చేసాడు. ఈ క్రమంలో కన్న తండ్రి అతనికి ఎలా సాయ పడ్డడానేది కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. చాలా కాలం తర్వాత తెలుగులో ఇలాంటి ఆర్ద్రతతో కూడిన తండ్రీ కొడుకుల సెంటిమెంట్ మూవీ కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. అంతేకాదు ఈ సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ప్రతి తండ్రి కుమారుడు చూడాల్సిన సినిమాగా తీర్చిదిద్దాడు. అక్కడక్కడ బోర్ కొట్టినా.. ఈ దసరాకు కుటుంబ ప్రేక్షకులు సకుటుంబంగా చూడాల్సిన మూవీ. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
నటీనటుల విషయానికొస్తే..
సుధీర్ బాబు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. పెంపుడు తండ్రి కోసం ఏమైనా చేసే కొడుకు పాత్రలో ఒదిగిపోయాడు.మరోసారి తన మార్క్ యాక్టింగ్ మెప్పిండు. ఇక పెంపుడు తండ్రి పాత్రలో నటించిన షాయాజీ షిండే మరోసారి తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక కన్న తండ్రి పాత్రలో నటించిన గోపీచంద్ నటన మెచ్చుకోవాల్సిందే. ఫిదా తర్వాత మరోసారి తండ్రి పాత్రలో నటించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘మా నాన్న సూపర్ హీరో’.. పండక్కి ఆకట్టుకునే తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామా..
రేటింగ్.. 3/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter