Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA-Movie Artists Association) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) కీలక నిర్ణయం తీసుకున్నారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. రాజీనామా వద్దని, ఉపసంహరించుకోవాలని కోరినా ఆ ప్యానెల్ సభ్యులు అంగీకరించలేదని పేర్కొన్నారు. అందుకే వారి రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకాష్ రాజ్, నాగబాబు 'మా' సభ్యత్వానికి చేసిన రాజీనామాలను మాత్రం ఆమోదించలేదన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన నేపథ్యంలో.... ఆ 11 మంది స్థానంలో తన ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయినవారిని విష్ణు నియమించవచ్చునని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది అక్టోబర్‌లో 'మా' అసోసియేషన్ ఎన్నికలు (MAA Elections 2021) జరిగిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ వాతావరణంలో ఈసారి ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ పోటాపోటీగా క్యాంపెయిన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అంతిమంగా మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ ఓడిపోయినప్పటికీ ఆయన ప్యానెల్ నుంచి పోటీ చేసిన 11 మంది గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఆ 11 మంది తమ పదవులకు రాజీనామా చేశారు.


మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తవద్దన్న ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆ సందర్భంగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ సభ్యులు వెల్లడించారు. తన ప్యానెల్ సభ్యుల రాజీనామాను ఆమోదించాలని ప్రకాష్ రాజ్ మంచు విష్ణుకు విజ్ఞప్తి చేశారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని విష్ణు (Manchu Vishnu) కోరినప్పటికీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ వెనక్కి తగ్గలేదు. ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న ఆ 11 మంది రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు తాజాగా మంచు విష్ణు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.


Also Read: Akhanda: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న బాలయ్య...100కోట్ల క్లబ్ లో 'అఖండ'...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook