Akhanda: బాక్సాఫీస్ పై బాలయ్య సింహగర్జన..100కోట్ల క్లబ్ లో 'అఖండ'...

Akhanda: బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ' సినిమా 100కోట్ల క్లబ్ లో చేరింది. తొలిసారి తన కెరీర్ లో 100కోట్ల మార్కును అందుకున్నాడు బాలయ్య.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 01:29 PM IST
Akhanda: బాక్సాఫీస్ పై బాలయ్య సింహగర్జన..100కోట్ల క్లబ్ లో 'అఖండ'...

Akhanda Movie: బాలయ్య గర్జనకు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. థియేటర్లు దద్దరిల్లాయి. సింహ కలెక్షన్ల సునామీ సృష్టించాడు. తొలిసారి తన కెరీర్ లో 100కోట్ల మార్కును అందుకుని...'అఖండ'(akhanda movie) విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 

నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన చిత్రం 'అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వం(Director Boyapati Srinu) వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. ఇది బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన మూడో చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లుతో దూసుకుపోతుంది. 

Also Read: Shyam Singha Roy: భారీ ధరకు అమ్ముడైన 'శ్యామ్‌ సింగరాయ్‌' శాటిలైట్‌ రైట్స్‌..ఎంతో తెలుసా?

అఖండ సినిమాకు గాను 10 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్(Akhanda Box Office Collection) ఇప్పుడు పరిశీలిద్దాం. నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు, కృష్ణాలో రూ. 2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 2.15 కోట్లు వచ్చాయి. ఇక రెండు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 49.34 కోట్లు షేర్ వచ్చినట్లు ట్రేడ్ నిపుణుల నుంచి వచ్చిన సమాచారం. కర్నాటక, దేశంలోని మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కలిసి 10 రోజుల్లో మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 58.74 కోట్లు షేర్ రాగా... రూ. 100 కోట్లు గ్రాస్‌ను దాటినట్లు చెబుతున్నారు. రెమ్యూనరేషన్స్ కలుపుకుని ఈ మూవీకి రూ. 53 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్(Akhanda Pre-release business) జరిగినట్లు సమాచారం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News