Maanvi Gagroo and Madhur Bhandarkar test positive for Coronavirus: ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు. కరీనా కపూర్‌ ఖాన్‌, దీపికా పదుకొనె, విశాల్ దద్లాని, జాన్ అబ్రహం, ఏక్తా కపూర్, రియా కపూర్ నోరా ఫతేహీ, అర్జున్ రామ్ పాల్, శిల్పా శిరోద్కర్, అర్జున్‌ కపూర్‌, రియా కపూర్‌, కరణ్‌ బూలానీ, అన్షులా కపూర్‌, స్వర భాస్కర్ (Swara Bhaskar) లాంటి స్టార్లు వైరస్ భారిన పడ్డారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ (Madhur Bhandarkar) కూడా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'రెండు డోసుల వాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. తేలికపాటి లక్షణాలు మాత్రమే నాకు ఉన్నాయి. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకొండి. అందరూ కొవిడ్ 19 ప్రోటోకాల్ పాటించండి. దయచేసి అందరూ మాస్కులు పెట్టుకోండి' అని డైరెక్టర్ మధుర్ భండార్కర్ ట్వీట్ చేశాడు. మరోవైపు 'ఫోర్ మోర్ షార్ట్స్' ఫేమ్ మాన్వీ గాగ్రూ (Maanvi Gagroo)కి సైతం కరోనా సోకింది. తనకు తేలిక పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని మాన్వీ గాగ్రూ ట్వీట్ చేశారు. మహమ్మారితో అందరూ దైర్యంగా పోరాడండి అని పేర్కొన్నారు. 


Also Read: Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్




టెలివిజన్ సీరిస్ 'ఘుమ్ హై కిసికే ప్యార్ మే'లో నటిస్తున్న ఆయేషా సింగ్‌ (Ayesha Singh)కు సైతం కరోనా (Covid 19) పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ఆ షోకు సంబంధించిన మొత్తం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆయేషా సింగ్ గురించి షో నిర్మాత రాజేశ్‌ రామ్ సింగ్ మాట్లాడుతూ... 'ఆయేషా సింగ్‌కు కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించాం. పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. వెంటనే చికిత్స చేయిస్తున్నాం. మొత్తం యూనిట్ సభ్యులకు కూడా టెస్టులు చేపించాం. అందరూ కొద్ది రోజులు ఐసొలేషన్‌లో ఉంటారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నాం' అని చెప్పారు.


Also Read: Swara Bhaskar: కరోనాతో నేను చనిపోతే.. మీ కుటుంబాలను ఎలా పోషిస్తారు! హీరోయిన్ సంచనల వ్యాఖ్యలు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook