Macherla Niyojakavargam 1st Day Total Collections Report: భీష్మ తర్వాత కమర్షియల్ హిట్ కోసం పరితపిస్తున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 12వ తేదీన వచ్చాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచి కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా బాగుందని కొందరు కామెంట్ చేస్తుంటే రొటీన్ సినిమా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ తెరెసా హీరోయిన్లుగా నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. సముద్రఖని విలన్ గా రెండు పాత్రలలో నటించి మెప్పించారు. ఈ సినిమాని ఆదిత్య మూవీస్ బ్యానర్ మీద ఆకెళ్ళ రాజ్ కుమార్ సమర్పించగా నిఖిల్ సోదరి నిఖితా రెడ్డి, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి స్వయంగా తమ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు.


మొదటి ఆట నుంచి కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ప్రభావం కలెక్షన్ల పైన కూడా పడుతుందని అనుకున్నారు. కానీ పెద్దగా ఆ ప్రభావం అయితే కలెక్షన్ల మీద పడలేదు. మరి ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి అనేది కలెక్షన్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. మాచర్ల నియోజకవర్గం మొదటి రోజు మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి.


నైజాం: 1.42 కోట్లు, సీడెడ్: 75 లక్షలు, ఉత్తరాంధ్ర : 68 లక్షలు, తూర్పు గోదావరి : 46 లక్షలు, పశ్చిమ గోదావరి : 19 లక్షలు, గుంటూరు: 56 లక్షలు, నెల్లూరు: 26 లక్షలు వసూళ్లు రాబట్టింది. ఏపీ తెలంగాణ మొత్తం:- 4.62 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక సహా మిగతా భారత్ లో 28 లక్షలు, ఓవర్సీస్ 25 లక్షలు టోటల్ వరల్డ్ వైడ్ 5.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమా మొత్తం బిజినెస్ = 21.20 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ 22 కోట్లుగా ఫిక్స్ చేశారు. సినిమా హిట్ కావాలంటే 16.85 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. 


Also Read: Raju Shrivastava: తీవ్ర విషమంగా కమెడియన్ శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి!


Also Read: Karthikeya 2 Review: సూపర్ హిట్ కార్తికేయ సీక్వెల్ సినిమా ఎలా ఉందంటే?'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.